అర్హులందరికీ పట్టా పాసుపుస్తకాలు

Sat,May 18, 2019 01:09 AM

రామడుగు: అర్హులందరికీ పట్టా పాసుపుస్తకాలు పంపిణీ చేస్తామని ఆర్డీవో ఆనంద్‌కుమార్ స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని తాసిల్ కార్యాలయంలో మీ భూమి-మీ పత్రాలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రైతులకు పట్టా పాసుపుస్తకాల కాపీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో అర్హులైన రైతులందరికీ పట్టా పాసు పుస్తకాలు తప్పనిసరిగా అందిస్తామన్నారు. గ్రామాల వారీగా భూసమస్యలను పరిష్కరించి, ఈకేవైసీ పూర్తి చేసి అప్పటికప్పుడే పాసు పుస్తకం పంపిణీ చేస్తామన్నారు. కాగా శుక్రవారం మండలంలోని కొక్కెరకుంట, వన్నారం గ్రామాల రైతుల నుంచి భూసమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. కొక్కెరకుంట నుంచి 32, వన్నారం నుంచి 29 దరఖాస్తులు రాగా పూర్తిస్థాయిలో సమస్యలు పరిష్కరించి 61 మంది రైతులకు పట్టా పాసు పుస్తకాలకు సంబంధించిన కాపీలు అందజేసినట్లు తాసిల్దార్ శ్రీనివాస్ తెలిపారు. ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ అశోక్, గిర్దావర్లు లక్ష్మణ్, తారాదేవి, తదితరులున్నారు.

భూ సమస్యల పరిష్కారానికి కృషి
గంగాధర: మండలంలో నెలకొన్న భూసమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తాసిల్దార్ కవిత అన్నారు. మండల కేంద్రంలోని తాసిల్ కార్యాలయంలో శుక్రవారం మీ భూమి-మీ పత్రాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు భూసమస్యల పరిష్కారానికి మీ భూమి-మీ పత్రాలు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రోజుకో గ్రామానికి చెందిన రైతుల నుంచి భూసమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం ఒద్యారం రెవెన్యూ గ్రామ పరిధిలోని రైతుల నుంచి 38 దరఖాస్తులు స్వీకరించినట్లు పేర్కొన్నారు. ఇందులో 14 మంది రైతుల భూ సమస్యలు పరిష్కరించగా, వివిధ కారణాలతో ఐదు దరఖాస్తులు తిరస్కరించగా, మరో 19 మంది రైతులకు చెందిన భూసమస్యలు పరిష్కరించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తాసిల్దార్ విశాలి, ఆర్‌ఐలు కనుకరాజు, రహీం, వీఆర్వోలు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్: రైతుల భూసమస్యలు పరిష్కరిస్తామని కొత్తపల్లి తాసిల్దార్ దేవేందర్ అన్నారు. తాసిల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీ భూమి- మీ పత్రాలు కార్యక్రమంలో భాగంగా మల్కాపూర్ గ్రామానికి చెందిన ఆరెపల్లి మల్లేశ్వరి భూమికి సంబంధించిన పట్టా పాసు పుస్తకం అందజేశారు. డిప్యూటీ తాసిల్దార్ మహేశ్, వీఆర్వో నళిని, తదితరులు పాల్గొన్నారు.

63
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles