పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి

Fri,May 17, 2019 01:20 AM

-కలెక్టర్‌ శరత్‌
-మహిళల్లో రుతుస్రావం-పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం
జగిత్యాల, నమస్తే తెలంగాణ : కిషోర బాలికల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ శరత్‌ సూచించారు. మహిళల్లో రుతుస్రావం, పరిశుభ్రతపై ఐఎంఏ హాలులో గురువారం నిర్వహిం చిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్‌ హాజర య్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఎ శరత్‌ మాట్లాడుతూ ఆడపిల్ల అమ్మగా ఎదిగేందుకు ‘రుతుస్రావం-పరిశుభ్రత’ అత్యంత ఆవశ్యకమనీ, జిల్లాలో కిషోర్‌ బాలికలకు రుతుస్రావ పరిశుభ్రత పట్ల అవగాహన కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని కలెక్టర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మే 28న అంతర్జాతీయ రుతుస్రావ పరిశుభ్రత అవగాహన దినోత్సవం సందర్భంగా జిల్లా లో కిషోర్‌ బాలికలు, మహిళలకు ఈ విషయమై అవగాహన కల్పించేందుకు ఐసీడీఎస్‌, ఐకేపీ ఆరోగ్యశాఖ సమన్వయంతో ఎస్‌బీఎం, యూనిసెఫ్‌ ఆధ్వ ర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమం ఒక ఉద్యమంగా ప్రతి పల్లెకు సమాచారం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉం దన్నారు.

మండల జిల్లా స్థా యిలో శిక్షణకు కొంతమంది మహిళను తయారు చేసి వారిని గ్రామ స్థాయిలోని మహిళలకు, కిషోర్‌ బా లికలకు అవగాహన కల్పించేలా కార్యాచరణ ప్ర ణాళిక రూపొందించాలని కోరారు. అనంతరం పోస్టరను ఆవిష్కరించారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీలతా రెడ్డి మాట్లాడుతూ మహిళల్లో 40 శాతం మాత్రమే రుతుస్రావ ఆరోగ్య పరిశుభ్ర త పట్ల అవగాహన కలిగి ఉందన్నారు. యూనిసెఫ్‌ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్‌ పీపీటీ ద్వారా ఇచ్చిన ప్రజేంటేషన్‌ గ్రామీణ ప్రాంతాల మహిళలను చైత న్యం కలిగించేలా ఉన్నదన్నారు. ఈ కార్యక్రమం లో ఏపీడీ గీత, ఎస్‌బీఎం కన్సల్టెంట్‌ చిరంజీవి, యూనిసెఫ్‌ సిబ్బంది శ్యామల, హరిణి, ఎపీ ఎం, సీడీపీఓలు, హెల్త్‌ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles