ప్రభుత్వ కళాశాలల్లోనే మెరుగైన విద్య

Fri,May 17, 2019 01:18 AM

గొల్లపల్లి: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఉత్తమమైన విద్య తో పాటు మెరుగైన వసతులను ప్రభుత్వం కల్పింస్తుందని మండలంలోని గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అధ్యాపకులు గురువారం ప్ర చారానికి శ్రీకారం చుట్టారు. మండలంలోని బీంరాజ్‌పల్లిలో పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులను కలుస్తూ, ప్రభు త్వం కళాశాలలో చేరాలని వారి తల్లిదండ్రులకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులపై మెరుగైన విద్యపై అవగాహన కల్పిం చారు.

పదిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కళాశాలలో ప్రవేశం కల్పించారు. ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత బస్‌పాస్‌, ఉచిత పాఠ్య పుస్తకాలు, స్కాలర్‌ షిప్‌ సౌకర్యం, మధ్యాహ్న భోజన వసతి తదితర వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రచారంలో కళాశాల ప్రిన్సిపాల్‌ తిరుపతి ఆధ్వర్యంలో అధ్యాపకులు రెమిటి మల్లారెడ్డి, వెంకట కృష్ణ, నల్లబెల్లి తిరుపతి, గాలిపల్లి శ్రీనివాస్‌, ఎం.రాంప్రసాద్‌, ఈ. నాగలక్ష్మి పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles