టాటా ఏస్‌ ఢీకొని ఆటో డ్రైవర్‌ మృతి

Fri,May 17, 2019 01:17 AM

జగిత్యాల రూరల్‌: మండలంలోని చల్‌గల్‌ గ్రామ శివారులో టాటా ఏస్‌ వాహనాన్ని వెనుక నుంచి ఆటో ఢీకొనడంతో ఆటో డ్రైవర్‌ తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల నుంచి మేడిపల్లి వైపు వెళ్తున్న ఆటోను చల్‌గల్‌ గ్రామ శివారులో ఎస్సీ కాలనీ వద్ద డ్రైవర్‌ ఆపి, అందులో ప్రయాణిస్తున్న వారిని దింపుతున్నాడు. అదే రూట్లో వెళ్తున్న టాటా ఏస్‌ వాహనం వేగంగా ఆగి ఉన్న ఆటోను ఢీకొంది.

ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ కత్తి పరశురాంకు తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా దవాఖానకు తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతూ పరశురాం మృతి చెందాడు. మృతుడు పరశురాం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండం ఖిలాపూనా గ్రామానికి చెందిన వాడనీ, ఉపాధి నిమిత్తం మేడిపల్లి మండల కేంద్రంలో నివాసం ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. ఆటోలో ప్రయాణిస్తున్న లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన మల్లవ్వ, కొండాపూర్‌ గ్రామానికి చెందిన అశ్విని, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పరశురాం బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles