సందడిగా అ‘పూర్వ’ సమ్మేళనం

Fri,May 17, 2019 01:16 AM

కోరుట్ల: పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికల పాఠశాల (కటికెవాడ) 1994-95 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థినులు గురువారం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని జరుపుకున్నారు. ఈ మేరకు పట్టణంలోని సినారె కళాభవనంలో వారంతా ఒక్కచోట కలుసుకొని పాఠశాలలో చదువుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రోజంతా ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం సహపంక్తి భోజనం చేశారు. కాగా, పదో తరగతి పూర్తి చేసి 25 ఏండ్లు కావడంతో సిల్వర్‌జూబ్లీ వేడుకలో భాగంగా కేక్‌ చేశారు. కార్యక్రమంలో పూర్త విద్యార్థినులు మచ్చ కవిత, సామల్ల సాయిలక్ష్మి, కల్పన, మమత, స్వర్ణలత, రమ, నాగజ్యోతి, లావణ్య, అనిత, రేణుక, రాజేశ్వరి, రజనీ తదితరులున్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles