పేద విద్యార్థినులకు ఆర్థికసాయం అందజేత

Fri,May 17, 2019 01:15 AM

కోరుట్ల: గల్ఫ్‌లో ఉంటున్న మండలంలోని చిన్నమెట్‌పల్లి గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ ఆది వీరమల్లయ్య గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినులకు రూ.5వేల చొప్పున ఆర్థిసాయమందించారు. ట్రిపుల్‌ ఐటీలో చదువుతున్న గ్రామానికి చెందిన కల్లెం వైష్ణమి, నర్సింగ్‌ కోర్సు విద్యనభ్యసిస్తున్న బొల్లె రవళిలకు ఉన్నత చదువులు చదివే స్తోమత లేకపోవడాన్ని గల్ఫ్‌లో ఉన్న వీరమల్లయ్య తెలుసుకున్నాడు.

అక్కడి నుంచే వీరిద్దరికి రూ.5వేల చొప్పున ఆర్థికసాయాన్ని పంపించారు. ఈ మేరకు గురువారం ఎంపీపీ తుమ్మనపెల్లి భారతి-సత్యనారాయణ ఈ మొత్తాన్ని విద్యార్థినులకు అందజేశారు. ఉన్నత విద్యకు ఆర్థికసాయం అందజేసిన మల్లయ్యను గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నూతిపెల్లి గంగరాజు, ఉపసర్పంచ్‌ మారు శ్రీనివాస్‌, నాయకులు నాగులపెల్లి జయరెడ్డి, అనంతరెడ్డి, కల్లెం తిరుపతి, శేఖర్‌, రాజేశ్వర్‌రెడ్డి, మల్లేశం, గ్రామస్తులున్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles