టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయం ఖాయం

Fri,May 17, 2019 01:14 AM

మెట్‌పల్లి టౌన్‌: కోరుట్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో టీఆర్‌ఎస్‌ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల విజయం ఖాయమని పార్టీ యవజన విభాగం నాయకులు పన్నాల మాధరరెడ్డి, ఒజ్జెల శ్రీనివాస్‌ అన్నారు. మెట్‌పల్లి పట్టణంలో గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో అర్హులంతా లబ్ధి పొందడంతో ఎన్నికల్లో ప్రజల నుంచి టీఆర్‌ఎస్‌కు అపూర్వ ఆదరణ లభించిందన్నారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు రూ.కోట్లు వెచ్చించి నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే చేయని అభివృద్ధి చేశారనీ, అందుకే ఎమ్మెల్యే బలపరిచిన టీఆర్‌ఎస్‌ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందుతారని వారు ధీమా వ్యక్తం చేశారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles