ఉచిత జనన ధ్రువీకరణ పత్రాలు అందజేత

Fri,May 17, 2019 01:14 AM

కోరుట్లటౌన్‌: రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం మైనార్టీల పిల్లలకు ఉచిత జనన ధ్రువీకరణ పత్రాలను ప్రజా గ్రామహిత మెగా విలీడర్స్‌ రోంబో అసోసియేషన్‌ సభ్యులు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా రంజాన్‌ మాసంలో భాగంగా మైనార్టీలకు జన్మించిన 100 మంది చిన్నారులకు సంస్థ తరఫున జూన్‌ 5వరకు ఎలాంటి రుసుము లేకుండా ధ్రువీకరణ పత్రాలు అందిస్తామని సంస్థ అధ్యక్షుడు గంగాధరి మధుకృష్ణ తెలిపారు. ఈ అవకాశాన్ని మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు కొత్తూరి వేణుగోపాల్‌, ఎంఏ రేహాన్‌, ఇమాన్యుయల్‌, ఇసాక్‌ ఉన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles