రెండో విడతకు వేళాయె..

Fri,April 26, 2019 01:03 AM

మెట్‌పల్లి,నమస్తేతెలంగాణ: రెండో విడతలో జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల ఎన్నికకు సమయం ఆసన్నమైంది. నేటి నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. జిల్లాలోని మెట్‌పల్లి డివిజన్ పరిధిలోని కథలాపూర్, మేడిపల్లి, కోరుట్ల, మల్లాపూర్, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం మండలాల్లో రెండో విడతలో ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఆరు జడ్పీటీసీ, 81 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారు చేశారు. నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి మొదలు కానుండగా గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ప్రధానంగా పల్లెల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీలో నిలిపేందుకు టీఆర్‌ఎస్‌కు అభ్యర్థుల కొదువ లేకపోగా, కాంగ్రెస్, బీజేపీలకు మాత్రం పలు స్థానాల్లో అభ్యర్థులు కరువైనట్లు తెలుస్తోంది. ఎవరో ఒకరిని పోటీలో నిలిపేందుకు ఆయా పార్టీలు అభ్యర్థుల కోసం వెంపర్లాడుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక పోరులో విజయ ఢంకా మోగించేందుకు టీఆర్‌ఎస్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. మండలాలు, గ్రామాలవారీగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో సరైన అభ్యర్థులను నిలిపేందుకు ముందస్తు కసరత్తు జరిపింది. కోరుట్ల నియోజకవర్గ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పక్కాగా గెలిచే అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలుపాలనే ఆలోచనతో మండలాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. వారం క్రితమే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా, మెరుగైన వారిని గుర్తించాకే అభ్యర్థిత్వాలను ఖరారు చేయనున్నట్లు సమాచారం.

ఏర్పాట్లు పూర్తి..
అధికార యంత్రాంగం నామినేషన్ల దాఖలు, స్వీకరణకు మూడు రోజులు గడువు విధించింది. మండల పరిషత్ కార్యాలయాలో అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ఇప్పటికే జడ్పీటీసీ స్థానంతో పాటు ఎంపీటీసీ స్థానాల వారీగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సిబ్బందిని నియమించారు. ఉదయం 10.30నుంచి సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5గంటలతో ముగుస్తుంది. 29న నామినేషన్ల పరిశీలన, తిరస్కరణ, 30న అప్పీలు, వచ్చే నెల 1న నామినేషన్ల తిరస్కరణ, ఆమోదం, 2న నామినేషన్ల ఉపసంహరణ, అదేరోజు సాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ఖరారు, గుర్తుల కేటాయింపు, 10న పోలింగ్ ఉంటుంది. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల, మెట్‌పల్లి, మేడిపల్లి, కథలాపూర్ మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నామినేషన్ల దాఖలు, స్వీకరణకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

మండలాలవారీగా రిజర్వేషన్ల వివరాలు..
ఇబ్రహీంపట్నంలో..
జడ్పీటీసీ స్థానం బీసీ మహిళకు రిజర్వేషన్ ఖరారు చేయగా, మండలంలో 12 ఎంపీటీసీ స్థా నాలకు గాను ఎస్టీ-1, ఎస్సీ-2, బీసీ-3, జనరల్ కు-6 స్థానాలు కేటాయించారు. అమ్మక్కపేట (ఎస్టీ మహిళ), ఇబ్రహీంపట్నం-2 (ఎస్సీ జనరల్), యా మపూర్ (ఎస్సీ మహిళ), వర్షకొండ (బీసీ జనరల్), వేములకుర్తి (బీసీ మహిళ), ఎర్ధండి (బీసీ మహిళ), డబ్బ (జనరల్ మహిళ), గోదూర్ (జనరల్), కోజన్‌కొత్తూర్ (జనరల్ మహిళ), ఇబ్రహీంపట్నం-1(జనరల్ మహిళ), తిమ్మాపూర్ (జనరల్), కోమటికొండాపూర్ (జనరల్)కు కేటాయించారు.

కోరుట్ల మండలంలో..
జడ్పీటీసీ స్థానాన్ని జనరల్ మహిళకు రిజర్వు చేయగా, 12 ఎంపీటీసీ స్థానాలకు గాను ఎస్సీలకు-2, బీసీలకు-4, జనరల్-6 స్థానాలు కేటాయించారు. అయిలాపూర్-1 (ఎస్సీ జనరల్), జోగిన్‌పల్లి (ఎస్సీ మహిళ), యూసుఫ్‌నగర్ (బీసీ మహిళ), మోహన్‌రావుపేట (బీసీ జనరల్), కల్లూర్ (బీసీ మహిళ), వెంకటాపూర్ (బీసీ జనరల్), పైడిమడుగు (జనరల్ మహిళ), చిన్నమెట్‌పల్లి (జనరల్), మాదాపూర్ (జనరల్), అయిలాపూర్-2 (జనరల్ మహిళ), నాగులపేట (జనరల్ మహిళ), ధర్మారం (జనరల్)కు రిజర్వ్ చేశారు.

మేడిపల్లి మండలంలో..
జడ్పీటీసీ స్థానాన్ని జనరల్‌కు కేటాయించగా, 15 ఎంపీటీసీ స్థానాలకు గాను ఎస్సీ-3, బీసీ-4, జనరల్ -8 స్థానాలు రిజర్వ్ చేశారు. వీటిలో మేడిపల్లి-2 (ఎస్సీ జనరల్ ), కాచారం (ఎస్సీ మహిళ), గోవిందారం (ఎస్సీ మహిళ), రాజలింగంపేట (బీసీ మహిళ), మేడిపల్లి-1 (బీసీ మహిళ), బీమారం ( బీసీ జనరల్), కొండాపూర్ (బీసీ జనరల్), కల్వకోట (జనరల్), మన్నెగూడెం (జనరల్), వల్లంపల్లి (జనరల్ మహిళ), వెంకట్రావుపేట (జనరల్ మహిళ), రాగోజిపేట (జనరల్), లింగంపేట (జనరల్), పోరుమల్ల (జనరల్ మహిళ), కట్లకుంట (జనరల్ మహిళ)కు కేటాయించారు.

కథలాపూర్ మండలంలో..
జడ్పీటీసీ స్థానాన్ని బీసీ జనరల్‌కు రిజర్వ్ చేయగా, 13 ఎంపీటీసీ స్థానాలకు ఎస్సీ-2, బీసీ-4, జనరల్-7 స్థానాలు కేటాయించారు. వీటిలో భూషణ్‌రావుపేట (ఎస్సీ జనరల్), బొమ్మెన (ఎస్సీ మహిళ), గంభీర్‌పూర్ (బీసీ మహిళ), అంబారిపేట (బీసీ జనరల్ ), పోతారం (బీసీ మహిళ), పెగ్గెర్ల (బీసీ జనరల్), సిరికొండ (జనరల్ మహిళ), చింతకుంట (జనరల్), కథలాపూర్ (జనరల్ మహిళ), దుంపేట (జనరల్), కలికోట (జనరల్ మహిళ), తక్కళ్లపల్లి (జనరల్ మహిళ), తాండ్య్రాల (జనరల్)కు రిజర్వ్ చేశారు.


మల్లాపూర్ మండలంలో..
జడ్పీటీసీ స్థానం జనరల్‌కు కేటాయించగా, 15 ఎంపీటీసీ స్థానాలకు గాను ఎస్టీ-1, ఎస్సీ-2, బీసీ-4, జనరల్-8 స్థానాలు రిజర్వ్ చేశారు. వేంపల్లి (ఎస్టీ మహిళ), చిట్టాపూర్ (ఎస్సీ మహిళ), మల్లాపూర్-1 (ఎస్సీ జనరల్), మొగిలిపేట (బీసీ మహిళ), వెంకట్రావుపేట్ (బీసీ మహిళ), రాఘవపేట (బీసీ జనరల్ ), సాతారం (బీసీ జనరల్ ), గుండంపల్లి (జనరల్ మహిళ), వాల్గొండ (జనరల్ మహిళ), మల్లాపూర్-2 ( జనరల్ మహిళ), ధర్మారం (జనరల్ మహిళ), కుస్తాపూర్ (జనరల్), రేగుంట (జనరల్), ముత్యంపేట (జనరల్), సిర్పూర్ (జనరల్)కు కేటాయించారు.

మెట్‌పల్లి మండలంలో..
జడ్పీటీసీ స్థానాన్ని జనరల్ మహిళకు రిజర్వు చేయగా, 14 ఎంపీటీసీ స్థానాల్లో ఎస్టీ-1, ఎస్సీ-2, బీసీ-4, జనరల్-7కు కేటాయించారు. ఆత్మనగర్ (ఎస్టీ మహిళ), చౌలమద్ది (ఎస్సీ మహిళ), పెద్దాపూర్ (ఎస్సీ జనరల్ ), రాజేశ్వర్‌రావుపేట (బీసీ జనరల్), బండలింగాపూర్-2 (బీసీ మహిళ), వెల్లుల్ల-2 (బీసీ మహిళ), బండలింగాపూర్-1 (బీసీ జనరల్), జగ్గసాగర్ (జనరల్ మహిళ), కోనరావుపేట (జనరల్), మెట్లచిట్టాపూర్ (జనరల్ మహిళ), ఆత్మకూర్ (జనరల్ మహిళ), వేంపేట (జనరల్), వెల్లుల్ల-1 (జనరల్ మహిళ), మేడిపల్లి (జనరల్)కు రిజర్వ్ చేశారు.


59
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles