వ్యభిచార గృహాలపై దాడులు

Fri,April 26, 2019 01:03 AM

వేములవాడ, నమస్తేతెలంగాణ: వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి వీధిలో వ్యభిచార గృహాలపై గురువారం పోలీసులు దాడులు నిర్వహించారు. పట్టణ సీఐ వెంకటస్వామి మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులతో దాడులు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒకరు, కృష్ణాజిల్లాలోని శ్రీహరిపురానికి చెందిన మరొక యువతి, వరంగల్ జిల్లాలోని వంగపాడు, హైదరాబాద్‌కు చెందిన వారితో కలిపి మొత్తం నలుగురు యువతులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచామన్నారు. న్యాయమూర్తి ఆదేశాలమేరకు వీరిని కరీంనగర్ స్వధార్ హోంకు తరలించామని తెలిపారు. వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్న కంసాని శ్రీధర్, భారతి, కంసాని రాణి, కంసాని వాణిలపై కేసు నమోదు చేశామనీ, ఇందులో ఇద్దరు పరారీలో ఉండగా ఇద్దరిని రిమాండ్ చేశామని చెప్పారు. వీరి ఆస్తుల జప్తునకు రెవెన్యూ డివిజనల్ అధికారికి కూడా నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు.

58
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles