కల్యాణం.. కమనీయం

Thu,April 25, 2019 03:27 AM

కోనరావుపేట: మండలంలోని నాగరం గ్రామంలోని కోదండరామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం అత్యం త వైభవంగా జరిగింది. ఉత్సవిగ్రహాల ప్రాణప్రతిష్ఠాపన అనంతరం వేదపండితులు కల్యాణఘట్టాన్ని నిర్వహించారు. తొలుత స్వామివారికి ప్రజాప్రతినిధులు పట్టు వ స్త్రాలను సమర్పించగా, అర్చకులు ఉత్సవవిగ్రహాలను అ త్యంత సుందరంగా అలంకరించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, రామన్మసరణ భజన సంకీర్తనలతో కోదండరామస్వామి, సీతాదేవిలను అరటి అకులతో, రంగురంగుల పూలతో ముస్తాబు చేసిన కల్యాణవేదికకు తీసుకువెళ్లారు. వేదాపండితులు మరగంటి గిరిదాచార్యులు, శ్రీనివాస్ తమ మంత్రోచ్యరణాల మధ్య కల్యాణం నిర్వహించారు. ఎమ్మెల్యే రమేశ్‌బాబు, ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమా ర్, చెన్నమనేని కుటుంబీకులతో పాటు ఆయా గ్రామాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి కల్యాణాన్ని వీ క్షించారు. స్వామివారికి ఓడిబియ్యం సమర్పించి మొక్కు లు చెల్లించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గోన్నారు.

పర్యాటక కేంద్రంగా నాగారం..
కల్యాణ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే రమేశ్‌బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ కోదండ రామస్వామివారి ఆలయాన్ని ఇప్పటికే రూ.36లక్షలతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. రాబోయే కాలంలో ఆలయం వేములవాడ అనుబంధ దేవాలయంగా మారనుందని, అందుకోసం 70ఎకరాల భూమిని వేములవాడ దేవస్థానానికి అప్పగించనున్నామని తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు కూడా స్వగ్రామాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారని వివరించారు. ఆలయ పునరుద్ధరణకు ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్ గతంలో రూ.16లక్షలను మంజూ రు చేశారని గుర్తుచేశారు. మై హోమం అధినేత రామశ్వేర్ రూ.కోటి ఇచ్చేందుకు ముందుకువచ్చారన్నా రు. అనంతరం కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్‌రావు, చలిమెడ లక్ష్మీనర్సింహారావులను ఎమ్మెల్యే రమేశ్‌బాబు సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజే శారు. ఎమ్మెల్యేను మాజీ జడ్పీటీసీ శ్రీకుమార్ సన్మానించా రు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, జడ్పీటీసీ అన్నపూర్ణ, సె స్ డైరక్టర్ తిరుపతి, సర్పంచ్ లావణ్య, వైస్‌ఎంపీపీ రవీందర్‌గౌడ్, తాసిల్దార్ రమేశ్‌బాబు, టీఆర్‌ఎస్ నేతలు ఏను గు మనోహర్‌రెడ్డి, నర్సయ్య, మండలాధ్యక్షుడు రా ఘవరెడ్డి, ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు వేంకటేశ్వర్లు, మహేశ్, నరేందర్, శ్రీకాంత్, సభ్యులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles