టీఆర్‌ఎస్‌తోనే బడుగు బలహీనవర్గాల సంక్షేమం

Thu,April 25, 2019 03:27 AM

కథలాపూర్: బడుగు బలహీనవర్గాల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ కట్టుబడి ఉందనీ, అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్‌ఎస్ లక్ష్యమని మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పెగ్గెర్లలో బుధవారం టీఆర్‌ఎస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. గ్రామానికి చెందిన కళాకారుడు బెజగం గంగాధర్ టీఆర్‌ఎస్‌లో చేరగా.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. గ్రామానికి చెందిన అంబేద్కర్ మాదిగ సంఘం సభ్యులు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అండగా ఉంటామని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలోబాపురెడ్డి మాట్లాడుతూ.. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టామని వివరించారు. గ్రామస్తులంతా కలిసి కట్టుగా టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు నాగం భూమయ్య, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు కేతిరెడ్డి మహిపాల్‌రెడ్డి, నాయకులు గడ్డం భూమరెడ్డి, లోక శశిధర్‌రెడ్డి, చెల్లపెల్లి అంజయ్య, కనగందుల గంగాధర్, పిడుగు తిరుపతిరెడ్డి, జవిడి జలపతిరెడ్డి, సూర్నేని వినోద్‌రావు, నస్కూరి భాస్కర్, అందె స్వాగత్ తదితరులు పాల్గొన్నారు.

వెట్ రన్ విజయవంతంపై హర్షం
కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 6 లో మొదటి పంపు వెట్ రన్ విజయవంతం కావడంపై మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కథలాపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రికార్డు సమయంలో పనులు పూర్తిచేసి విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తిచేసిన అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తి కాగానే రివర్స్ పంపింగ్ ద్వారా కథలాపూర్, మేడిపల్లి మండలాలు సస్యశ్యామలం కాబోతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవలే మిడ్‌మానేరు అధికారులు సర్వే పూర్తి చేశారని తెలిపారు.

ఆలయంలో పూజలు..
మండలంలోని భూషణరావుపేటలో నగరేశ్వరస్వామి విగ్రహా ప్రతిష్ఠాపన బుధవారం వేకువజామున ఘనంగా నిర్వహించారు. అర్చకుల వేదమంత్రోచ్ఛరణలు.. డప్పుల చప్పుళ్లు, భక్తుల భజనలతో స్వామివారి విగ్రహా ప్రతిష్ఠాపనోత్సవం జరిగింది. అనంతరం గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో అర్చకులు మాధవాచార్యులు, వేణుగోపాల్‌శర్మ, పవన్, రవి, నిర్వాహకులు ఉశకోల శంకరయ్య, సర్పంచ్ కూన సులోచన, ఉపసర్పంచ్ పల్లె సరిత, ఆలయ నిర్మాణ దాతలు, నాయకులు, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles