మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట

Wed,April 24, 2019 12:58 AM

-గ్రామాల అభివృద్ధితోనేదేశాభివృద్ధి
-పరిషత్ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలి
-టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి
-వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు
-కథలాపూర్, మేడిపల్లిలో కార్యకర్తల సమావేశం
మేడిపల్లి : గ్రామాల్లో మౌలిక వసతులకు ప్రభు త్వం పెద్దపీట వేస్తుందనీ, గ్రామాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుంతుందని వేములవాడ ఎ మ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పీఎన్‌ఆర్ గార్డెన్‌లో మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక, టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, వేములవాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏనుగు మనోహార్‌రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు హాజరై మాట్లాడారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అందరూ సమన్వయం తో పని చేసి టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని పేర్కొన్నా రు. టీఆర్‌ఎస్ పార్టీ టిక్కెట్ రాని వారు నిరుత్సాహపడవద్దనీ, నామినేటెడ్ పదవులలో వారికి అదిష్టానం పెద్దపీట వేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుందారపు అన్నపూర్ణ, రవీందర్, జడ్పీటీసీ నెల్లుట్ల పూర్ణిమ, ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కెర గంగాధర్, స ర్పంచ్‌లు గడ్డం నారాయణరెడ్డి, కాచర్ల సురేశ్, ద్యావనపెల్లి అభిలాష్, వంగ వెంకటేశం, టీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు సుధవేని గంగాధర్, సింగిల్‌విండోచైర్మన్ వోద్దినేని హరిచరణ్‌రావు, మిట్టపెల్లి భూమారెడ్డి, కోప్పెర లింగారెడ్డి, కో ఆప్స న్ సభ్యుడు షేక్ హైమద్, నాయకులు పోలాస నరేంధర్, కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డి, నల్ల మహిపాల్‌రెడ్డి, గౌరి భూమయ్య, వీరబత్తిని ఆంజనేయులు, ఉత్కం శంకర్‌గౌడ్, సుధవేని భూమేశ్ గౌడ్, టీ ర వీందర్, అంకం సాగర్, అడ్లగట్ట ప్రకాశ్, కుంట అంజన్‌రెడ్డి, రాజేందర్, నందు, ముదురుకోళ్ల శ్యాం, గాజిపాషా, లక్ష్మణ్‌కుమార్, రవీందర్‌రావు, మకిలి దాస్, తదితరులు పాల్గొన్నారు.

చీకటి ఒప్పందాన్ని బీజేపీ, కాంగ్రెస్ నేతలు తేల్చాలి..
కథలాపూర్ : టీఆర్‌ఎస్ పార్టీని నేరుగా ఎన్నికల్లో ఎదుర్కునే శక్తి లేక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయనీ, ఆ ఒప్పందా న్ని నియోజకవర్గంలోని బీజేపీ, కాంగ్రెస్ నేతలు తేల్చాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని ర మేశ్ బాబు డిమాండ్ చేశారు. మంగళవారం కథలాపూర్ మండలకేంద్రంలోని ఎస్‌ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వ హించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జాతీయపార్టీలుగా చెప్పుకొనే కాంగ్రెస్, బీజేపీ నేతలు వేములవాడలో సిద్ధాంతాలు మరిచిపోయి సొంత లాభాలు చేసుకునే పార్టీలుగా మారాయని విమర్శించారు. పార్టీ కండువాలు మార్చుకుంటే ఓట్లు పడతాయనే భ్రమలో వారున్నారనీ, బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందంపై కాం గ్రెస్ నేత ఆది శ్రీనివాస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరుఫున స్థానిక నాయకులే అభ్యర్థులుగా బరిలో ఉంటారనీ, ఎక్కడో హైదరాబాద్ నుంచి తేవాల్సినవసరం లేదని చమత్కరించారు. ఎంపీటీసీ టికెట్ రాని వారికి నామినేటెడ్ పోస్టు ల్లో ప్రాధాన్యతనిస్తామనీ, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో పార్టీలో చేర్చుకోమని హెచ్చరించారు.

ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికకు గ్రామాలవారీగా చర్చించిన ఎమ్మెల్యే, మార్క్‌ఫెడ్ చైర్మన్
కథలాపూర్ మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి గ్రామాలవారీగా నాయకులను పిలిపించుకొని చర్చించారు. కొన్ని స్థానాల్లో ఇద్దరు, ముగ్గురు నాయకులు ఎంపీటీసీ టికెట్లు ఆశీస్తున్నట్లు ఎమ్మెల్యేకు తేల్చి చెప్పారు. దీంతో గ్రామాలవారీగా నాయకులు మరోసారి సమావేశమై చర్చించి ఒక్కరి పేరును సూచించాలని ఎమ్మెల్యే రమేశ్‌బాబు వారికి సర్ధిచెప్పారు. కాగా, తాండ్య్రాల ఎంపీటీసీ స్థానానికి టీఆర్‌ఎస్ తరుఫున మాన్పురి కిరణ్‌రావు పేరు ఖరారైనట్లు ఆ గ్రామ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమం లో టీఆర్‌ఎస్ నాయకులు పోలాస నరేందర్, ఏనుగు మనోహర్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, మండలాధ్యక్షుడు నాగం భూమయ్య, నాయకులు వర్ధినేని నాగేశ్వర్‌రావు, ఆకుల రాజేశ్, మామిడిపెల్లి రవి, కల్లెడ శంకర్, గోపు శ్రీనివాస్, విద్యాసాగర్‌రావు, అంజయ్య, నాంపెల్లి లింబాద్రి, దొప్పల జలేంద ర్, దాసరి గంగాధర్, ఎండీ ఇక్భాల్, పోతు శేఖర్, గడ్డం భూమారెడ్డి, చిలుక రాజేంద్రప్రసాద్, పాలె పు రాజేశ్, ఎండీ రఫీ, గజ్జెల స్వామి, ఏజీబీ మహేందర్, సీతారామ్‌నాయక్, కిషన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

65
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles