గురుకుల ఉపాధ్యాయుల పోస్టులను రెగ్యులర్ చేయాలి

Wed,April 24, 2019 12:56 AM

కమాన్‌చౌరస్తా: తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న పార్ట్-టైం ఉపాధ్యాయులను క్రమబద్దీకరిస్తూ వేతనాలను పెంచాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. తాము గత 15 సంవత్సరాల నుంచి రెగ్యులర్ ఉపాధ్యాయులకు మాదిరిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లు, కళాశాలల్లో అన్నీ అర్హతలుండి వారితో పా టు గా సమానంగా పనిచేస్తున్నామనీ, అయితే పనికి తగిన సమాన వేతనం రావడం లేదన్నారు. రెగ్యులర్ ఉపాధ్యాయులకు కనీస వేతనం రూ. 60 వే లుంటే అందులో మాకు నాలుగో వంతైనా రావ డం లేదని ఆవేదన చెందారు. పీరియడ్ వారీగా వేతనాలు చెల్లించాల్సి ఉండగా రోజువారీ వే తనాలను చెల్లిస్తున్నారన్నారు. తమను పార్ట్‌టైం-ఉపాధ్యాయులు అనే పదాన్ని తొలగించి దాని స్థా నంలో ఫుల్-టైం, రెసిడెన్సియల్ టీచ ర్స్‌గా గుర్తించాలని కోరారు. సుప్రీం కోర్టు తీర్పుమేరకు సమాన పనికి సమా న వేతనం ఇప్పించాలన్నారు. మహిళా ఉపాధ్యాయులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు. ఇంకా పలు సమస్యలతో కూడిన వినతిపత్రా న్ని ఇస్తూ సీఎం మా దీనస్థితిని గమనిం చి ఆదుకోవాలని కోరారు. ఎస్ జమాల్, ఎస్ మనోహర్, ఏ సాగర్, శ్రీనివాస్, లక్ష్మణ్, నవీన, రోజ, ధనలక్ష్మి, లావ ణ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles