ఎస్‌ఐ వైఖరిని నిరసిస్తూ సుద్దపెల్లి గ్రామస్తుల ధర్నా

Wed,April 24, 2019 12:56 AM

పెగడపల్లి : పెగడపల్లి ఎస్‌ఐ జీవన్ వైఖరిని నిరసిస్తూ సుద్దపెల్లి గ్రామస్తులు మంగళవారం మండ ల కేంద్రంలో ధర్నా నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. మండలంలోని సుద్దపెల్లి గ్రామానికి చెంది న తిర్మని వినయ్ సోమవారం సాయంత్రం ద్విచ క్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా వాహనాన్ని ఆపి ట్రాక్టర్‌పై అక్రమంగా ఇసుక తరలిస్తున్నావం టూ పోలీస్‌స్టేషన్‌కు రావాలంటూ ఎస్‌ఐ కొట్టాడని పేర్కొన్నారు. దాదాపు వంద మంది గ్రామస్తులు మండల కేంద్రానికి తరలి వచ్చి అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిపి పోలీసుల వైఖరిని నిరసిస్తూ రాస్తారోకో చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ జీవన్ సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన కారులతో మాట్లాడి శాతింపజేశారు. అంతలోనే జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ సంఘటన స్థలానికి చేరుకొని ఆం దోళనకారులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. సు ద్దపెల్లిలో జరిగిన సంఘటన తీరుపై, ధర్నా చేసిన విషయమై వారితో మాట్లాడి ఫిర్యాదు స్వీకరించా రు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పోలీసులు ప్రజా సేవకులేననీ, రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ కొనసాగుతుందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలనీ, జరిగిన సంఘటనపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెంకటరమణ పేర్కొన్నారు. డీఎస్పీ వెంట జగిత్యాల రూ రల్ సీఐ రాజేశ్ ఉన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles