ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

Wed,April 24, 2019 12:56 AM

సిరిసిల్ల క్రైం: ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను సిరిసిల్ల పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఇందులో 15 మంది యువకులు పట్టుబడ్డారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ ప్రాంతంలోని గదిలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ జరుగుతుందున్న సమచారంతో ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాలతో స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సిరిసి ల్ల, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన స య్యద్ సాదాబ్, రాచూరి మహేశ్, మహ్మద్ అష్షు, మ హ్మద్ అఫ్రిది, పాతం శ్యాం, మహమ్మద్ సద్దాం, మ హ్మద్ అమినొద్దీన్, బద్దం రమణారెడ్డి, బైరగొండి సం దీప్, కొత్తపల్లి అజయ్‌కుమార్, షేక్ అమీర్, జహీర్, సమీర్, మనోజ్ పట్టుబడ్డారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటరమణ వివరాలను వెల్లడించా రు. వీరిని విచారించగా, కొంతకాలంగా హైదరాబాద్ లో ఉండే సంజయ్‌కుమార్, కృష్ణ, జిందం విశాల్, మాచర్ల విక్కి, గొట్టె అరుణ్, చందుతో జతకలిసి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగులు చేస్తూ అక్రమంగా సం పాదిస్తున్నారు. తమ మొబైల్ ఫోన్లలో గూగుల్ పే అప్ ద్వారా నగదు రూపేణా చెల్లిస్తున్నారు.

బెట్టింగ్‌లో భా గంగా మంగళవారం సాయంత్రం చెన్నై వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య జరగబోయే క్రికెట్ మ్యాచ్ కోసం బెట్టింగ్ కాయడానికి సిరిసిల్ల కశాశాలలోని గదిలో బెట్టింగ్ కోసం సమావేశమయ్యారు. ఈ సమాచారం తెలియడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. వీరి నుంచి 15 మొబైల్ ఫోన్లు, బెట్టింగ్ పేపర్, రూ.7550లు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు 15 మందిని స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేశామనీ, కోర్టులో హాజరుపరుచుతామని డీఎస్పీ చె ప్పారు. దీంతో పాటు హైదరాబాద్, కరీంనగర్‌లో ఉం డే ఇతర వ్యక్తులు సంజయ్, కృష్ణ, చందు, జిందం వి శాల్, మాచర్ల విక్కి, ప్రశాంత్, గొట్టె అరుణ్‌ను త్వరలో నే పట్టుకుంటామని తెలిపారు. సిరిసిల్లకు చెందిన అమ్జత్, మోయిజ్‌ను తాసిల్దార్ ఎదుట బైండోవర్ చేశామన్నారు. జిల్లాలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడే వారిపై పూర్తి సమాచారం పోలీసులకు ఉందనీ, వీటిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు చెప్పారు. యువత చెడు వ్య సనాలకు బానిసై బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌తోపాటు ఇతర అక్రమ కార్యకలాపాల సమాచారాన్ని 100 డ యల్ ద్వారా కానీ, సంబంధిత పోలీస్‌స్టేషన్, పోస్ట్ బా క్సుల ద్వారా తెలియజేయాలని ప్రజలను విజ్ఞప్తి చేశా రు. ఈ సమావేశంలో సీసీఎస్ సీఐ బన్సీలాల్, ఎస్‌ఐ శ్రీనివాసరావు, పోలీసు, సీసీఎస్ సిబ్బంది ఉన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles