వార్ వన్‌సైడే

Wed,April 24, 2019 12:55 AM

-జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జనం టీఆర్‌ఎస్‌వైపే
-సబ్బండవర్గాల అభివృద్ధే సర్కారు ధ్యేయం
-ప్రాజెక్టులతో ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టి ప్రజలకు అందిస్తాం
-విలేకరుల సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
కొడిమ్యాల : సబ్బండ వర్గాల అభివృద్ధే టీఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఐదేళ్లుగా అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు. ఈ అభివృద్ధిని చూసే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు వార్ వన్‌సైడ్‌గా తీర్పునిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని మెట్ట ప్రాంతాలకు ప్రాజెక్టుల ద్వారా ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి రివర్స్ పంపింగ్‌తో ప్రజలకు నీటిని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రాదేశిక ఎన్నికల్లో ఇతర పార్టీల నాయకులు పోటీ చేయడానికి భయపడుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, టికెట్లు సైతం తీసుకోవడానికి జంకుతున్నట్లు తెలిపారు.

మండలంలోని 12ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటున్నట్లు తెలిపారు. మండల కేంద్రానికి కుల సంఘాలకు రూ.5కోట్ల నిధులను మంజూరు చేయించినట్లు చెప్పా రు. అన్ని కుల సంఘాలకు న్యాయం జరిగేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ప్రధాని మోడీ 29వ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని ఒప్పుకున్నట్లు తెలిపారు. గత 70ఏళ్లలో జరగని అభివృద్ధి ఐదేళ్లలో జరిగిందన్నారు. దీనికి నిదర్శనమే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతుబీమా తదిరత పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వంద శాతం నెరవేర్చామని, మెనిఫెస్టోలో లేని పథకాలను సైతం ప్రవేశపెట్టి ప్రజలకు అందించినట్లు తెలిపారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరమ ని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ మొత్తం కోటి ఎకరాలు మాగాని కాబోతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలందరు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మెన్నేని రాజనర్సింగారావు, ఆయా గ్రామాల సర్పంచులు, తదితరులున్నారు.

45
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles