స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలి..

Wed,April 24, 2019 12:55 AM

గంగాధర: స్థానిక సంస్థల ఎన్నికలకు టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు సమాయత్తం కావాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మంగళవారం గంగాధరలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పార్టీ గెలుపు కోసం పని చేసే ప్రతి కార్యకర్తను కాపాడుకుంటూ తగిన న్యాయం చేస్తామన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్ కోసం ఆశావాహుల ఎక్కువ మంది ఉన్నారనీ, కార్యకర్తల అభిప్రా యం మేరకు ఒకరికే టికెట్ కేటాయించడం జరుగుతుందన్నారు. పార్టీని కాదని రెబల్‌గా పోటీ చేసే వారిని భవిష్యత్తులో గుర్తించమని తెలిపారు. గ్రామాల్లో అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఆ యా గ్రామాల నాయకులు, కార్యకర్తలే తీసుకోవాలని తెలి పారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఆయా పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరు తున్నారని పేర్కొ న్నారు.

కాంగ్రెస్, బీజేపీల్లో టికెట్లు అడిగే వారే లేరన్నారు. జడ్పీటీసీ స్థానంతో పాటు, 14 ఎంపీటీసీ స్థానాల్లో విజయకేతనం ఎగరవేయడానికి కార్యకర్తలు సైనికుల్లా సని చేయాలని సూచించారు. ఎంపీపీ దూలం బాలగౌడ్, కేడీసీసీడీ డైరెక్టర్ వెలిచాల తిర్మల్‌రావు, గంగాధర సిం గిల్ విండో అధ్యక్షుడు వొడ్నాల రాంరెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ మండలాధ్యక్షుడు పుల్కం గంగన్న, జిల్లా సభ్యుడు కర్ర విద్యాసాగర్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ ద్యావ మధుసూదన్‌రెడ్డి, యూత్ మండలాధ్యక్షుడు తాళ్ల సురేశ్, బీసీసెల్ అధ్యక్షుడు దూలం శంకర్‌గౌడ్, ఎస్సీసెల్ అధ్యక్షు డు ఎస్ అజేయ్, సర్పంచులు నవీన్‌రావు, మడ్లపెల్లి గంగాధర్, ఎం డీ నజీర్, ఆకుల శంకరయ్య, కంకణాల వి జేందర్‌రెడ్డి, వీ దామోదర్, సిరిమల్ల మేఘరాజు, కొంకటి శంకర్, డీ హన్మంతరెడ్డి, ఎంపీటీసీలు అలువోజు నంద య్య, బాబు మల్లేశం, లక్ష్మణ్‌గౌడ్, నాయకులు ఆకుల మధుసూదన్, పుల్కం నర్సయ్య, ఉప్పుల గంగధర్, సాగి మహిపాల్‌రావు, శ్రీరాం మధు, కంకణాల రాజ్‌గోపాల్‌రెడ్డి, కరబూజ తిరుపతిగౌడ్, సామంతుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles