కేసీఆర్‌తోనే ఆలయాల అభివృద్ధి

Tue,April 23, 2019 12:59 AM

కోనరావుపేట: ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే, తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే పురాతన ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు కొనియాడారు. మండలంలోని నాగారం కో దండ రామస్వామి ఆలయంలో సోమవారం నిర్వహించి న ఉత్సవమూర్తుల ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. తన మాతృమూర్తి చెన్నమనేని లలితాదేవి జ్ఞాపకార్థం ఉత్సవ విగ్రహాలను ఎమ్మెల్యే అందజేశారు. విగ్రహాల శోభాయాత్రను డప్పు చప్పుళ్ల మధ్య వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రాముడి వి గ్రహం, ఆలయ చైర్మన్ వేంకటేశ్వరరావు లక్ష్మణుడి విగ్ర హం, మాజీ జడ్పీటీసీ శ్రీకుమార్ సీతాదేవి విగ్రహాన్ని ఆ లయానికి తీసుకొచ్చారు. అనంతరం మరింగటి గిరిదారచార్యులు, శంకర్ విగ్రహాల ప్రాణప్రతిష్ఠలో భాగంగా యాగశాల ప్రవేశం చేసి పూజలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పురాతన ఆలయాలను అభివృద్థి చేయడానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చోరవ చూపుతున్నారన్నారు. కోదండ రామస్వామిఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం ఆలయంలో పూజ లు నిర్వహించి, తీర్థప్రసాదాలను స్వీకరించారు. అర్చకు లు ఆయనకు మహదాశీర్వచనం చేశారు. కార్యక్రమంలో వేములవాడ ఆలయ ఈవో రాజేశ్వర్, ఎంపీపీ లక్ష్మి, జ డ్పీటీసీ అన్నపూర్ణ, వైస్‌ఎంపీపీ రవీదంర్‌గౌడ్, సర్పంచ్ లావణ్య, సెస్ డైరక్టర్ తిరుపతి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు రాఘవరెడ్డి, ఉపసర్పంచ్ నాగారాజు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles