రమణీయం.. రథోత్సవం

Tue,April 23, 2019 12:59 AM

- వైభవంగా సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు
గంభీరావుపేట: మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం నిర్వహించిన స్వామివారి రథోత్సవం రమణీయం గా సాగింది. ఉదయత్పూర్వం ఐదు అంతుస్తుల రథంపై కొలువుదీరి సీతారామచంద్ర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. పుర వీధుల గుండా ఊరేగారు. స్వామి వారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు. కట్నకానుకలు సమర్పించుకున్నారు. భక్తులు మండలం నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసినారు. స్వామి వారి నామ స్మరణతో సీతారాం బజార్ పుర వీధులు మార్మోగాయి. స్వామి వారి రథాన్ని లాగడానికి భక్తులు పోటీ పడ్డారు. రథోత్సవానికి విచ్చేసిన భక్తులకు ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గిర్ని కిషన్ కుటుంభ సభ్యులు చల్ల, అంబలిని ఉచితంగా పంపిణీ చేశారు.

28
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles