అకాల వర్షం.. అపార నష్టం

Tue,April 23, 2019 12:59 AM

పెగడపల్లి/ కోరుట్ల/ వెల్గటూర్/ మల్యాల/బుగ్గారం/ మల్లాపూర్: జిల్లాలో సోమ వారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి కోతకు వచ్చిన వరి పొలాలు నేల వాలడంతో పాటు, మామిడి కాయలు భారీ స్థాయిలో రాలి పోయి రైతులకు తీవ్ర నష్టం సంభవించింది. కొనుగోలు కేంద్రాలకు తీసు కొచ్చిన ధాన్యం తడువడంతో పాటు, ధాన్యం కుప్పల్లో వర్షం నీళ్లు నిలిచి రైతులకు తీవ్ర నష్టం సంభవించింది. మండలంలో వరి పంట తర్వాత అధికంగా ఉన్న మామిడి తోటలకు వర్షం వల్ల తీవ్ర నష్టం జరిగింది. ఈ యేడు మామిడి కాయలు తక్కువ మొత్తంలో కాయగా, బారీగా వీచిన ఈదురు గాలులకు కాయలన్ని నేల రాలడంతో తీవ్ర నష్టం సంభవించిందని మామిడి రైతులు భోరున విలపిస్తున్నారు. పెగడపల్లి మండలంలో పలు గ్రామాల్లో ఇళ్ల రేకులు లేచిపోయాయి. ఈదుర గాలుల వల్ల పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిచిపోయింది. పెగడపల్లి నుంచి జగిత్యాలకు వెళ్లే ప్రధాన రహదారిలో ఈదు రు గాలులకు అనేక చోట్ల చెట్లు కూలడంతో రాక పోకలు నిలిచిపోవడంతో, సర్పంచ్ ఉప్పలంచ లక్ష్మణ్ ఎక్స్‌కెవేటర్ తీసుకొచ్చి, చెట్లను తొలగించడంతో రాక పోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఎల్లాపూర్‌లో విద్యుత్ వైర్లు తెగి పడి, పోనవేని లచ్చయ్యకు చెందిన గడ్డివాము దగ్ధమైంది. రాత్రి వరకు అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు.

రాలిన మామిడి, నేలవాలిన వరి..
కోరుట్ల మండలంలోని మోహన్‌రావుపేట్, చిన్నమెట్‌పల్లి, జోగిన్‌పల్లి, పైడిమడుగు, సర్పరాజ్‌పూర్ గ్రామాల్లో వీచిన ఈదురు గాలులతో మామిడికాయలు నేలరాలాయి. వెల్గటూరు మండలంలోని ఎండపల్లిలో వరి నేలవాలింది. 250 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సర్పంచ్ మారం జలెందర్‌రెడ్డి, వ్యవసాయాధికారి అనూష, వీఆర్‌వో శంకరయ్య నష్టపోయిన వరి పంటలను పరిశీలించి, పంట నష్టం అంచనా వేశారు. వెల్గటూరు గ్రామ శివారులో గల అయ్యప్ప క్రష్షర్ ఆవరణలో గల ఓ చెట్టు విరిగి విద్యుత్ వైర్ల పై పడిపోగా విద్యుత్ స్తంభం విరిగిపోయింది. దీనితో వెల్గటూరుకు మధ్యాహ్నం రెండు గంటల పాటు విద్యుత్ సేవలు నిలిచి పోయాయి. మల్యాల మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో మామిడి కాయలు నేలరాలాయి. ఈ సందర్భంగా మానాల, మ్యాడంపెల్లి, తక్కళ్లపెల్లి, రాంపూర్, ఒగులాపూర్, గొర్రెగుండం గ్రామాల్లో భారీగా ఈదురు గాలులు వీయడంతో మామిడి తోటల్లో మామిడి కాయలు నేలరాలడంతో రైతులు నష్టపోయారు. కోత దశకు వచ్చిన వరి పంటలు నేలవాలాయి. బుగ్గారం మండలంలో మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన వరి ధాన్యం పాక్షికంగా తడిసింది. ఈదురు గాలులతో మామిడి పంటలకు నష్టం కలిగింది. బుగ్గారం సర్పంచ్ మూల సుమలత మార్కెట్ యార్డును సందర్శించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. మల్లాపూర్ మండలంలో మామిడికాయలు రాలిపోవడంతో పాటు, నువ్వు, సజ్జ, వరి పంటలు నేలకొరిగాయి. వాల్గొండలో రెండు విద్యుత్ స్తంభాలు విరిగి ఇండ్లపై పడ్డాయి. ధాన్యం కోనుగోలు కేంద్రాల్లో ఉన్న వరిధాన్యాన్ని ఎంపీడీఓ కోటేశ్వర్‌రావు పరిశీలించి, నిర్వహకులకు పలు సూచనలను చేశారు.

37
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles