పరిషత్ నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి

Mon,April 22, 2019 12:58 AM

-సారంగాపూర్, బీర్‌పూర్ మండల కేంద్రాల్లో నామినేషన్ కేంద్రాలు
-సహాయ జిల్లా ఎన్నికల అధికారి పుల్లయ్య
సారంగాపూర్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగం గా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి సోమవారం నుంచి నామినేషన్లను స్వీ కరించనున్నట్లు సహయ జిల్లా ఎన్నికల అధికారి, ఎంపీడీఓ పుల్లయ్య పేర్కొన్నారు. ఆదివారం ఆయ న మాట్లాడుతూ సారంగాపూర్, బీర్‌పూర్ మండల కేంద్రాల్లో రెండు నామినేషన్ల కేంద్రాలు ఏర్పాటు చేసి ఆర్‌ఓ, ఏఆర్‌ఓలను నియమించినట్లు పేర్కొన్నారు. ఎంపీటీసీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు సారంగాపూర్ మండలానికి చెందిన వారు మండల పరిషత్ కార్యాలయంలో, బీర్‌పూర్ మండలానికి చెందిన వారు బీర్‌పూర్ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నుంచి నామినేషన్లు దాఖలు చేయవచ్చని పేర్కొన్నా రు. సారంగాపూర్ మండలంలో ఏడు ఎంపీటీసీ స్థానాలు, ఒక్క జడ్పీటీసీ, బీర్‌పూర్ మండలంలో ఆరు ఎంపీటీసీ స్థా నాలు, ఒక్క జడ్పీటీసీ స్థానాలకు ఎన్నిలకు జరుగుతున్నాయని అన్నారు.

సారంగాపూర్ మండలంలో మొత్తం 18,7 16 ఓటర్లు, బీర్‌పూర్ మండలంలో మొత్తం 16,063 మం ది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ ఆస్తులపై ఎలాంటి రాతలు రాయవద్దనీ, పోస్టర్లు అంటించరాదని పేర్కొన్నారు. ప్రైవేట్ కార్యాలయాలు, ఇళ్లపై ఏమైనా రాతలు రాయాలంటే తప్పనిసరిగా ఇంటి యజమానుల అనుమతి తీసుకోవాలని, లేదంటే ఇంటి యజమానులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. గ్రా మాల్లో పార్టీల నాయకులు గొడవలు పడకుండా ఎవరి ప్ర చారాలు వారు నిర్వహించుకోవాలన్నారు. ఈ నెల 22 నుంచి 24వరకు అభ్యర్థుల నామినేషన్లు స్వీకరిస్తారని పేర్కొన్నారు. జడ్పీటీసీ జనరల్ స్థానాలకు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.2,500, ఎంపీటీసీ జనరల్ స్థానాలకు రూ.2, 500, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్థానాలకు రూ.1,250 నామినేషన్ల ఫీజుల చెల్లించాల్సి ఉం టుందని పేర్కొన్నారు. ఎన్నిక ల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పంచాయతీ బకాయి లు చెల్లించి ఉండాలని పేర్కొన్నారు. నామినేషన్లు ఉదయం 10.30గంటల నుంచి సా యంత్రం 5గంటల వరకు స్వీకరిస్తారని తెలిపారు. మే 6న పోలింగ్ జరుగుతుందన్నారు. ఓటర్లు 22రకాల గుర్తింపు కార్డుల్లో ఏ ఒక్క గుర్తింపు కార్డు ఉన్న ఓటు హక్కు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.

56
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles