నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు షురూ..

Mon,April 22, 2019 12:58 AM

-మండలంలో 27 కేంద్రాలు ఏర్పాటు
-ఇప్పటికే కేంద్రాలకు చేరిన వడ్లు
-2లక్షల క్వింటాళ్లు కొనే అవకాశం
పెగడపల్లి: మండలంలో సోమవారం నుంచి వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. రబీలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు మండలంలో 27కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడు సహకార సంఘాల ఆధ్వర్యంలో 15, సెర్ప్ ఆధ్వర్యంలో 12 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సెర్ప్ ఆధ్వర్యంలో మండలంలోని పెగడపల్లి, ఐతుపల్లి, రాజరాంపల్లి, రాంబదృనిపల్లి, సుద్దపల్లి, రాములపల్లి, బతికపల్లి, మద్దులపల్లి, దోమలకుంట, నర్సింహునిపేట, ల్యాగలమర్రి, నామాపూర్‌లలో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఏపీఎం సమత తెలిపారు. పెగడపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో ఏడుమోటలపల్లి, పెగడపల్లి, వెంగళాయిపేట, ఆరవల్లి, బతికపల్లి, శాలపల్లి, లింగాపూర్‌లలో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సీఈవో తడ్కమడ్ల గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

నంచర్ల సహకార సంఘం ఆధ్వర్యంలో ల్యాగలమర్రి, ఎల్లాపూర్, కీచులాటపల్లి, నంచర్ల గ్రామాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సంఘం సీఈవో రౌతు మధుకర్ తెలిపారు. నందగిరి సంఘం ఆధ్వర్యంలో ఐతుపల్లి, నందగిరి, నామాపూర్, మ్యాకవెంకయ్యపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సీఈవో రవీందర్‌రెడ్డి వివరించారు. వరికి ఏ గ్రేడ్ రకానికి రూ.1,770, సాధారణ రకానికి రూ.1,750 మద్దతు ధర ప్రభుత్వం చెల్లించనుంది. కాగా, రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని అధికారులు, కేంద్రాల నిర్వాహకులు సూచిస్తున్నారు. గత ఖరీఫ్‌లో మండలంలో సుమారు 2.80 లక్ష ల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. రబీలో వర్షాభావ పరిస్థితులు, ఎస్సారెస్పీలో తగినంత నీరు లేక వరి సాగు విస్తీరణం తగ్గింది. దీంతో ఈసారి 2లక్షల క్వింటాళ్లే కేంద్రాలకు వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

ధాన్యం ఆరబెట్టాకే తీసుకురావాలి
కొనుగోలు కేంద్రాల్లో స్థలం కొరత ఉన్నందున రైతులు ధాన్యాన్ని ఆరబెట్టాకే తీసుకురావాలి. రైతులు ధాన్యం దళారులకు విక్రయించి నష్ట పోవద్దు. కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలి. మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లోకి ఇప్పటికే రైతులు ధాన్యం తీసుకువచ్చారు. సోమవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తాం. గన్నీ సంచులు, టార్పాలిన్లను అందుబాటులో ఉంచుతాం. కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా పూర్తి వసతులు కల్పిస్తున్నాం. - సరిత, తాసీల్దార్

రైతులకు ఇబ్బందులు రానివ్వం
కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం. కొనుగోళ్ల విషయంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. ధాన్యం తెచ్చిన రైతులకు వరుస నంబర్లు కేటాయించి వెంటవెంటనే తూకం వేస్తాం. గన్నీ సంచులు, టార్పాలిన్ల కొరత లేకుండా చూస్తాం. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలిస్తాం. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో సకాలంలో డబ్బులు జమ చేస్తాం.
- సమత, సెర్ప్ ఏపీం, పెగడపల్లి

35
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles