అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరికలు

Mon,April 22, 2019 12:56 AM

సారంగాపూర్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలవారు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పార్టీ సీనియర్ నాయకుడు, బీర్‌పూర్ సింగిల్ విండో చైర్మన్ ముప్పాల రాంచందర్ రావు అన్నారు. ఆదివారం రాత్రి సారంగాపూర్, బీర్‌పూర్ మండలాల ఒడ్డెర సంఘం అధ్యక్షుడు చెల్ల వెంకటేశ్, గ్రామశాఖ అధ్యక్షుడు సంపంగి లక్ష్మీరాజం కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరగా, రాంచందర్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులమై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం రాంచందర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో అర్హులకు పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ తదితర పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నట్లు చెప్పారు. గురుకుల విద్యాలయాల ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గర్షకుర్తి శిల్ప, ఉపసర్పంచ్ హరీశ్, నాయకులు గర్షకుర్తి రమేశ్, రైతు సమన్వయ సమితి కన్వీనర్ శ్రీనివాస్, మేదరి సంఘం అధ్యక్షుడు ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles