మూడు విడతల్లో ప్రాదేశిక పోరు

Sun,April 21, 2019 01:20 AM

(జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ) జిల్లాలో జిల్లా, మండల ప్రజాపరిషత్తులకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 22న మొదటి విడతకు, 26న, 30న రెండో విడతకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. మొత్తంగా 18 జడ్పీటీసీ స్థానాలు, 214 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రజలు ప్రత్యక్ష పద్ధతిలో ఎంపీటీసీ, జడ్పీటీసీలను ఎన్నుకుంటారు. ఎంపీటీసీలు ఎంపీపీలను, జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్లను పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు.

22న తొలివిడత నోటిఫికేషన్..
తొలి విడుతలో ధర్మపురి, బుగ్గారం, వెల్గటూర్, సా రంగాపూర్, బీర్‌పూర్, రాయికల్ మండలాల ఎన్ని క లు నిర్వహించనున్నారు. 22న ఆయా మండలాల పరిధిలో రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. ఆ రోజు నుంచి 24 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 25న నామినేషన్ల పరిశీలన, 26న అప్పీ లు, 28న నామినేషన్ల ఉపసంహరణ, 28న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. మే 6న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.

26న రెండో విడతకు..
రెండో విడతలో మేడిపల్లి, కథలాపూర్, కోరుట్ల, మెట్‌పెల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో ఎన్నికలు నిర్వహిం చను న్నారు. ఆ రోజు నుంచి 28 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 29న పరిశీలన, 30న అప్పీలు, మే 2న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుం ది. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. మే 10న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు

30న మూడో విడతకు
మూడో విడతలో మల్యాల, కొడిమ్యాల, జగిత్యాల అర్బన్, జగిత్యాల రూరల్, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో ఎన్నికలు నిర్వహించను న్నారు. ఈ నెల 30 నుంచి మే 2వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, మే 3న నామినేషన్ల పరిశీలన, మే 4న ఫిర్యాదులపై వి చారణ నిర్వ హించనున్నారు. మే 5న ఉప సంహరణ ప్రక్రియ ఉండనుంది. మే 6న బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా విడుదల, మే 14వ తేదీన మూడోతతత విడదల ఎన్నికలు నిర్వహించనున్నారు.

27న ఓట్ల లెక్కింపు..
జిల్లాలో మూడు విడతల్లో నిర్వహించే జిల్లా, మం డల ప్రజా పరిషత్తులకు నిర్వహించే ఎన్నికలకు సం బంధించి మే 27న ఓట్ల లెక్కింపు ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాతనే పరిషత్తు ఓట్లు లెక్కించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు జిల్లాలో నాలుగు చోట్ల పరిషత్తు ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేస్తున్నది.

మండల కేంద్రాల్లోనే నామినేషన్లు..
అన్ని మండల కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ప్రతి రోజు ఉద యం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటారు. ప్రతి జడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్ అధికారి చొప్పున 15 మంది అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారులను నియమించారు. మరో ముగ్గురు రిటర్నింగ్ అధికారులను రిజర్వులో ఉంచుతున్నారు. ప్రాదేశిక నియోజవకర్గానికి రిటర్నింగ్ అధికారికి సహాయకులుగా ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాలకు కేటాయించిన రిటర్నింగ్ అధికారులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యహరిస్తారు.

ఆన్‌లైన్‌లోనూ దాఖలుకు చాన్స్
ఈసారి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నామినేషన్ సమర్పించే విధానం అందుబాటులోకి వచ్చింది. నామినేషన్ పత్రాల కోసం రిటర్నింగ్ అధికారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. అభ్యర్థులు ముం దుగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. క్యాండిడెట్ పోర్టల్‌లోకి వెళ్లాలి. అందులో నాలుగు ఆప్షన్లు ఉంటాయి. వాటిలో ఆన్‌లైన్ నామినేషన్ ఫర్ రూరల్ బాడీస్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు ఎంపీటీసీ స్థానానికి, జడ్పీటీసీ స్థానానికి ఆన్‌లైన్ నామినేషన్ సమర్పించేందుకు ఆప్షన్ చూపెడుతుంది. ఏ అభ్యర్థి ఏ పదవికి పోటీ చేస్తున్నారో దానిని ఎంచుకుని ఆన్‌లైన్‌లోనే వివరాలు నమోదు చేయాలి. అప్‌లోడ్ చేసిన తర్వాత ఆ కాపీని ప్రింట్ తీసుకుని కచ్చితంగా రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. కేవలం ఆన్‌లైన్ సబ్‌మిషన్ నామినేషన్ పరిగణలోకి తీసుకోరాదని ఎన్నికల సంఘం తెలిపింది. గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆన్‌లైన్ నామినేషన్ అమలు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు స్థానిక ఎన్నికలకు ఈ పద్ధతిని ప్రవేశపెట్టినట్లు అధికారులు వెల్లడించారు.

డిపాజిట్ వ్యయం..
పరిషత్తు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు డిపాజిట్లు మొదలుకుని వ్యయ పరిమితిని ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. జనరల్ జడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు 5 వేలు, ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల్లో పోటీ చేసే వారు 2,500 డిపాజిట్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వుడ్‌కు కేటాయించిన జడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు 2,500, ఎంపీటీసీ ప్రా దేశిక నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు 1,2 50 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. జనరల్ స్థానాల్లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కులధ్రువీకర ణ పత్రాలు సమర్పిస్తే డిపాజిట్‌లో రాయితీ ఉంటుం ది. జనరల్ జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే డి పాజిట్ 2,500, ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు 1,250 డిపాజిట్లు చేయాల్సి ఉంటుంది.

బ్యాలెట్ పద్ధతి ద్వారానే..
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించారు. ఇందుకు కావాల్సిన బ్యాలెట్ బాక్స్‌లను అందుబాటులో ఉంచారు. ఎంపీటీసీ స్థానానికి గులాబీ, జడ్పీటీసీ స్థానానికి తెలుపు రంగు పత్రాలు వినియోగించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులను ఎన్నికల సంఘం ప్రకటించింది.

అభ్యర్థుల వ్యయ పరిమితి..
ఎన్నికల్లో జడ్పీటీసీగా పోటీ చేస్తున్న అభ్యర్థి ఖర్చు 4 లక్షలు ఎంపీటీసీగా పోటీ చేస్తున్న అభ్యర్థి ఖర్చు 1.50గా నిర్ణయించారు. అయితే పోటీ చేస్తున్న అభ్యర్థులు ఖర్చుల లెక్కలను బ్యాంకు ఖాతాల ద్వారానే చెల్లించాలనే నిబంధనలు విధించింది.

రిజర్వేషన్లు
214 మండల ప్రాదేశిక నియోజకవర్గాలు, 18 జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలు, ఎంపీపీ స్థానాలకు ఇప్పటికే అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. జగిత్యాల జిల్లాలోని 18మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జడ్పీటీసీ స్థానాల్లో ఎస్సీ మహిళ 1, ఎస్సీ జనరల్ 3, బీసీ 5, జనరల్ 9, జడ్పీ చైర్మన్ స్థానాన్ని బీసీ జనరల్‌కు కేటాయించారు. ఎంపీపీ స్థా నాలకు ఎస్టీ 1, ఎస్సీ 4, బీసీ 4, జనరల్ విభాగాని కి 9 స్థానాలను కేటాయించారు. ఇక జిల్లాలోని 21 4ఎంపీటీసీ స్థానాల్లో ఎస్సీ కేటగిరికి 40 స్థానాలను రి జర్వు చేశారు. ఇందులో ఎస్సీ జనరల్ 16, ఎస్సీ మ హిళకు 24 స్థానాలు ఇచ్చారు. ఎస్టీ మహిళ 6 స్థానాలు కేటాయించారు. బీసీ కేటగిరికి 55 స్థానాలు కేటాయించగా, బీసీ జనరల్‌కు 25, బీసీ మహిళకు 30 స్థానాలు రిజర్వయ్యాయి. జనరల్ కోటాకు 60 స్థానాలు కేటాయించారు. జనరల్ మహిళకు 53గా కేటాయించారు. జనరల్‌లో 113 స్థానాలకు అవకాశం కల్పించారు.

ఎన్నికల ప్రక్రియకు సర్వం సిద్ధం
జిల్లాలో ప్రాదేశిక పోరుకు అధికారులు దాదాపు ఏ ర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 5,61,141మంది ఓటర్లున్నట్లుగా ఇప్పటికే లెక్క తే ల్చారు. 367పోలింగ్ లోకేషన్లు, 1,058 పోలింగ్ బూ తులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 18 మం ది రిటర్నింగ్ అధికారులను కేటాయించారు. వారితో పాటు మరో నలుగురిని రిజర్వ్ కేటగిరిలో ఉంచారు. 214 మండల ప్రాదేశిక స్థానాలకు సైతం 80కి పైగా రిటర్నింగ్ అధికారులను నియమించనున్నారు. జి ల్లా లో 18 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు.

94
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles