జెర్సీకోడెలను సమర్పించవద్దు

Sun,April 21, 2019 01:18 AM

వేములవాడ కల్చరల్: వేములవాడ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారికి భక్తులు జెర్సీకోడెలను కానుకగా సమర్పించవద్దని ఆలయ ఈవో దూస రాజేశ్వర్ ఒక ప్రకటనలో కోరారు. దక్షిణకాశీగా ప్రసిద్ధిచెందిన రాజన్న ఆలయంలో ధర్మదేవతా కోడెల స్వరూపంలో ప్రతీనిత్యం భక్తులతో పూజలందుకుంటారని తెలిపారు. ఆ కోడెలు మంచి ఆరోగ్యవంతంగా ఉంటేనే భక్తులు వారి స్వస్థలాల నుంచి తీసుకురా వాలని కోరారు. జెర్సీకోడెలు, పాలుమరవని కోడెలు, అనారోగ్యమైన కోడెలు, అంగవైకల్యమెరంర కోడెలు, వాతావరణానికి అనూకూలించని కోడెలను స్వా మివారికి సమర్పించవద్దని సూచించారు. అనారోగ్యమైన కోడెలను భక్తులు స్వా మివారికి సమర్పిస్తే దోషము వాటిల్లుతుందని ఈవో వెల్లడించారు.

23న హుండీ లెక్కింపు ..
వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారికి భక్తులు హుండీలో వేసిన కానుకలను 23వ తేదీ మంగళవారం ఉదయం లెక్కించనున్నట్లు ఆలయ ఈవో దూస రాజేశ్వర్ వెల్లడించారు. అందుకుగాను ఉదయం ఆలయ ఓపెన్‌స్లాబ్‌పై ఆ లయ అధికారులు, సిబ్బంది విధిగా హాజరుకావాలని ఆయన సూచించారు.

55
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles