రైతు పక్షపాతి సీఎం కేసీఆర్

Sun,April 21, 2019 01:18 AM

జగిత్యాల రూరల్ : రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల మండలంలోని తాటిపెల్లిలో శుక్రవారం కురిసిన వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాల వల్ల పంట నష్టపోవడం దురదృష్టకరమన్నారు. మండలం యూనిట్‌గా, గ్రా మం యూనిట్‌గా బీమా కాకుండా రైతు యూనిట్‌గా బీమా ఉంటే రైతులకు లాభం జరుగుతుందన్నారు. దాదాపు ప్రతి రైతూ పంట రుణాలు తీసుకున్నప్పుడు పంటలకు బీమా కింద డబ్బులు తీసుకుంటారని తెలిపారు. కానీ, పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం రాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అనీ, రైతుబంధు, రైతుబీమా, సకాలంలో ఎరువులు, 24గంటల కరెంట్ అందజేస్తున్నారని తెలిపారు. పంట నష్టం గురించి అధికారులతో మాట్లాడడం జరిగిందనీ, వారం రోజుల కింద సైతం అకాల వర్షం వల్ల రాయికల్ మండలంలో మామిడి, వరిపంటలకు నష్టం వాటిల్లిందన్నారు. రైతు యూనిట్‌గా బీమా కల్పించేందుకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. నాయకులు శంకర్, నీరటి గంగారెడ్డి, అంజన్న, రాజన్న, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

కొడిమ్యాలలో సాయంత్రం వడగండ్ల వర్షం..
కొడిమ్యాల: మండలంలోని ఆయా గ్రామాలలో శనివారం సాయంత్రం వడగండ్ల వర్షానికి వరి పంటలకు నష్టం వాటిళ్లింది. ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట నెలపాలు కావడంతో రైతు లు అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరుఫున ఆదుకోవాలని కోరారు. మండలంలోని పూడూర్, గౌరాపూర్, నర్సింహులపల్లి గ్రామాల్లో ఎక్కవగా వడగండ్ల వర్షం కురిసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కురిషిన వర్షానికి సుమారు రెండు వందల ఎక్టార్లలో పంట నష్టం వచ్చినట్లు వ్యవసాయాధికారి పీ జ్వోతి తెలిపారు. నేడు ఆయా గ్రా మాల్లో సర్వే చేసి ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో మామిడి తోటలలో మామిడి కాయలు రాలిపోగా, ప్రభుత్వం తరుఫున ఆదుకోవాలని రైతులు కోరారు.

46
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles