శాస్త్రీయ పద్ధతులు రైతులకు చేరినప్పుడే అధిక దిగుబడి

Sun,April 21, 2019 01:17 AM

జగిత్యాల టౌన్ : శాస్త్రీయ పరిశోధన ఫలితాలు, వివిధ విస్తరణ పద్ధతులు రైతులకు చేరినప్పుడే వ్యవసాయంలో పెట్టుబడి తగ్గి నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ తెలంగాణ రాష్ట్రం సంయుక్తంగా నిర్వహించిన ఉత్తర తెలంగాణ మండల వ్యవసా య పరిశోధన, విస్తరణ సలహా సంఘ సమావేశం (ఖరీఫ్/రబీ 2019-20) కామారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను సమతుల ఎరువుల వాడకం, సమగ్ర యాజమాన్య పద్ధతులపై కేంద్రీకరించాలని సూ చించారు. రైతులు సైతం శాస్త్ర సాంకేతిక సలహాలను అనుసరించి మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎన్నుకొని, సరై న మార్కెట్‌ను, డిమాండ్‌ను బట్టి సాగు చేయాలని సూచించారు. అనంతరం పరిశోధన సంచాలకుడు డా.ఆర్ జగదీశ్వర్ మాట్లాడుతూ గతేడాది రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ స్థితిగతుల గురిం చి వివరించారు. ప్రధానంగా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ సమన్వయం తో వరిలో దోమపోటును, మొక్కజొన్నలో కత్తెర పురుగును, పత్తిలో గులాబీ రంగు కాయ తొలుచు పురుగులను సమర్థవంతంగా అరికట్టగలిగామన్నారు. విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకుడు రాజిరెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

వాతావరణంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా వివిధ పంటలలో జరుగుతున్న పరిమాణాలను వివరించి రైతులు క్రమం తప్పకుండా వారి పంటలను గమనిస్తూ సాగు చే యాలని సూచించారు. అనంతరం జగిత్యాల మండలం పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు ఉమారెడ్డి మాట్లాడుతూ గతేడాది నెలకొన్న వాతావరణ పరిస్థితులు, ఉత్తర తెలంగాణ మండలంలో నెలకొన్న వ్యవసాయ పరిశోధన స్థానాలు చేసిన పరిశోధనల ఫలితాలను వివరించారు. భోజనానంత రం విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల ప్రధా న శాస్త్రవేత్తల ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, సోయాచిక్కుడు, పత్తి, ఆపరాలు, చిరుధాన్యాల లో తప్పక చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు. శాస్త్రవేత్తలు రాజేశ్వర్ పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles