పవనసుత హనుమాన్‌కీ జై..

Sat,April 20, 2019 01:27 AM

సారంగాపూర్ : జై శ్రీరామ్... జై హనుమాన్... నామ స్మరణతో ఆయా గ్రామాల్లోని ఆంజనేయ స్వామి ఆలయాలు మార్మోగాయి. సారంగాపూర్, బీర్‌పూర్ మండలంలోని ఆయా గ్రామాల్లోని ఆంజనేయ స్వామి ఆలయాల్లో హనుమాన్ చిన్న జయంతిని పురస్కరించుకొని శుక్రవారం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమలపాకులు, జిల్లేడు పూలతో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీక్షాపరులు ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం దీక్షాప రులు మాల విరమణ చేసేందుకు కొండగట్టుకు బయలు దేరారు.

పలు ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు
మల్యాల : హనుమాన్ చిన్న జయంతిని పురస్కరించుకొని ముత్యంపేట గ్రామంలో గల పలు ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది పెరుమాండ్ల ఆలయం వద్ద ముత్యంపేట గ్రామస్తులు, స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదానం నిర్వహించగా సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి అన్నదానాన్ని ప్రారంభించారు.
భజరంగ్‌దళ్ సభ్యుల ఆధ్వర్యంలో....

మండలంలోని మద్దుట్ల గ్రామానికి చెందిన భజరంగ్‌దళ్ సభ్యులు హనుమాన్ చిన్న జయంతిని పురస్కరించుకొని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చే దీక్షాపరులకు కొండపై ఉచితంగా చల్లని నీటిని, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మెన పరమేశ్, పత్తిపాక వినోద్, కెల్లేటి రాజేశ్, కోల సాయి గణేశ్, ఎం సురేశ్, తదితరులు పాల్గొన్నారు.

జగిత్యాల టౌన్ : జిల్లా కేంద్రంలోని అరవింద్‌నగర్‌లో అభయాంజనేయస్వామి, ధరూర్ క్యాంపు కోదండ రామాలయం, ఎడ్లంగడి రామాలయం, శివ వీధి విశ్వేశ్వరాల యం, కూరగాయల మార్కెట్ శ్రీవెంటేశ్వరస్వామి ఆలయం, అంగడిబజార్ మార్కండేయ ఆలయం, బైపాస్ రోడ్ అష్టలక్ష్మీ ఆలయాల్లో శుక్రవారం హన్మాన్ చిన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆంజనేయ స్వామికి అభిషేకము, చందనంతో అలంకరణ, తమలపాకు గారెల పేర్లు, పూల మాలలతో స్వామి వారిని అందంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. శ్రీఅభయాంజనేయస్వామి ఆలయంలో 108 కళశాలను ఏర్పాటు చేసి వాటిలోని పవిత్ర జలాలతో స్వామి వారికి అభిషేకం జరిపారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భారీ సంఖ్యలో పాల్గొన్న మహిళలు, భక్తులు హనుమాన్ చాలీసా పథనం గావించారు. ఈ కార్యక్రమంలో అష్టలక్ష్మి ఆలయం చైర్మన్ గరిపెల్లి శంకర్, శమంత, సత్సంగ్ సభ్యుడు తవుటు రాంచంద్రం, రేగొండ నరేష్, కొత్తపెల్లి శ్రీనివాస్, కొత్తపెల్లి నాగభూషణం, ఎర్ర రంజిత్, మానుక సంతోష్, అశోక్, బోనగిరి వాసు, జైశెట్టి రాజశేఖర్, ఉమాపతి, ముసిపట్ల లక్ష్మినారాయణ, విశ్వేశ్వర ఆలయ చైర్మన్ బాసెట్టి ప్రజ్ఞ, జ్ఞానప్రకాశ్, ఊటూరి లక్ష్మీ, మహేష్, మంత్రి సత్తయ్య, గంప విశ్వేశ్వర్, ప్రముఖ సంఘ సేవకుడు డాక్టర్ రాజగోపాలచారి, రేపల్లె హరిక్రిష్ణ, ఉమారాణి, కవిత, సుజాత, శోభ, దామోదర్‌రావు, కాసం వెంకన్న, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

88
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles