అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

Sat,April 20, 2019 01:26 AM

జగిత్యాల రూరల్ : అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి జి రజిత తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మా ట్లాడుతూ 2019-20విద్యా సంవత్సరానికి గానూ తెలంగాణ ప్రభుత్వం విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్థులకు రూ.20లక్షల స్కాలర్ సిప్ అందించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, న్యూజిలాండ్ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ కోర్సుల్లో చదవాలనుకుంటున్న ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు.

తెలంగాణకు రాష్ట్రంలోని ఎస్సీ కులానికి చెందిన వారై ఉండి ఏడాది ఆదాయం రూ.5లక్షలకు మించకూడదనీ, పీజీ చదివేందుకు పోస్టు గ్రాడ్యుయేషన్‌లో మొదటి మార్కులు వచ్చిన వారు అర్హులని తెలిపారు. TOEFL/IELTS/GREGMAT లో అర్హత కలిగి ఉండాలనీ, పాస్‌పోర్టు, వీసాకు అర్హత కలిగి ఉండాలన్నారు. విదేశీ విశ్వవిద్యాలయం నుంచి అడ్మిషన్ పొంది ఉండాలనీ, ఒక కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే ఈ పథకానికి అర్హులని తెలిపారు. జిల్లాలోని అర్హులైన ఎస్సీ విద్యార్థులు www.telangana.epass.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఈ నెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిర్దిష్టమైన ఫార్మాట్, అవసరమైన డాక్యుమెంట్లతో విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలనీ, ఇంటర్వ్యూలకు ఒరిజినల్ డాక్యుమెంట్లతో హైదరాబాద్‌లోని మాసట్‌ట్యాంక్‌లోని డీఎస్‌ఎస్ భవన్‌లోని మూడో అంతస్తులో ఉన్న డైరెక్టర్ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో ఈ నెల 25న ఉద యం 11గంటలకు జరిగే ఎంపికకు హాజరు కావాలన్నారు. ఆసక్తి గల ఎస్సీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు ఈపాస్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles