ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన జగిత్యాల విద్యార్థులు

Fri,April 19, 2019 02:27 AM

జగిత్యాల లీగల్ : ఇంటర్మీడియెట్ బోర్డు గురువారం ప్రకటించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జగిత్యాలలోని పలు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు అత్యుత్తమ సత్తా చాటారు.

శ్రీ వాణి జూనియర్ కళాశాల..
ఇంటర్మీడియెట్ బోర్డు గురువారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని శ్రీ వాని జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించినట్లు కళాశాల యాజమాన్యం తెలిపారు. ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో ఎం గౌరిప్రియ 461, జీ రేవంత్ 460, సీఈసీలో బీ రజిత 463, ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో ఏ పూజ 980, సీఈసీలో వై సుప్రజ 973, బైపీసీలో ఎం శ్రీలేఖ 965 మార్కులు సాధించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల డైరెక్టర్ కే జగదీశ్ చందర్‌రావు, ప్రిన్సిపాల్ ఎస్ రాజేందర్ శర్మ, రం గారెడ్డి, దామోదర్ రావు, ఏ రాజేందర్, ఏ వేణుగోపాల్, కౌసల్య తెలుగు పండిత శిక్షణ కళాశాల కరస్పాండెంట్ ఎంవీ నర్సింహా రెడ్డి అభినందించారు.

నేతాజీ వొకేషనల్ జూనియర్ కళాశాల..
జిల్లా కేంద్రంలోని నేతాజీ వొకేషనల్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపినట్లు కళాశాల కరస్పాండెంట్ సింగం భాస్కర్ తెలిపారు. ద్వితీయ సంవత్సరం విభాగంలో ఎంపీహెచ్‌డబ్ల్యూలో ఏ మధుమిత 953, ఎస్ అనూష 942, సీపీ అండ్ ఎంలో టీ అంజలి 959, పీ మమత 918, ఈటీలో బీ సంజయ్ 949, ఆర్ సాయికుమార్ 942, సీఎస్‌ఈలో బీ మౌనిక 946, డీ నందిని 940, ఎంఎల్‌టీలో కే మధుకర్ 870, ఎం సుధాకర్ 846, పీఎస్‌టీటీలో కే సౌజన్య 870, కే సరస్వతి 807, ఐఎంలో సీహెచ్ చంద్రబాబు 843, బీ మనోజ్ 822మార్కులు సాధించినట్లు ఆ యన తెలిపారు. ప్రథమ సంవత్సరం ఎంఎల్‌టీలో పీ వినిత్ 473, సీఎస్‌ఈలో ఎన్ రాహుల్ 458, ఈటీలో ఏ వినయ్ 432, ఎంపీహెచ్‌డబ్ల్యూలో ఎస్ ప్రణీత 450, ఐఎంలో ఏ వరుణ్ 418మార్కులు సాధించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను కరస్పాండెంట్ సింగం భాస్కర్, ప్రిన్సిపాల్ గుడ్ల శ్రీకాంత్, ఉపన్యాసకులు అంజత్ ఖాన్, నరేంద్ర వర్మ, ఉదయ్ కిరణ్, సుల్తానా, భాగ్యశ్రీ, రమేశ్, అనిల్ అభినందించారు.

శ్రీనిధి బాలికల జూనియర్ కళాశాల ..
ఇంటర్మీడియెట్ బోర్డు గురువారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని శ్రీనిధి బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధిక మా ర్కులు సాధించినట్లు కళాశాల నిర్వాహకులు తెలిపారు. ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ విభాగం లో ఎస్ శిరీష 454, బైపీసీలో ఈ పద్మ 407, సీ ఈసీలో బీ సోని 480, ద్వితీయ సంవత్సరం ఎం పీసీలో కే మాధురి 964,ఎస్ మనీష 966, సీ ఈసీలో పీ భవిత 959మార్కులు సాధించినట్లు వా రు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల నిర్వాహకులు సాగర్ రావు, సంతోష్ రా వు, మల్లల్‌రావు, లక్ష్మీనారాయణ అభినందించారు.

శ్రీ చైతన్య జూనియర్ కళాశాల..
ఇంటర్మీడియట్ బోర్డు గురువారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపినట్లు కళాశాల కరస్పాండెంట్ ముసిపట్ల రాజేందర్ తెలిపారు. ప్రథమ సంవత్సరంలో ఎంపీసీలో ఇట్టె వైష్ణవి 462, అలిశెట్టి జయసిద్ది 461, బైపీసీలో ఎండీ సోయబుద్దీన్ 433, సంగా ని మనస్విని 432, సీఈసీలో చిలుక శ్రీజ 491, ఆఫ్సహా రాహీల 483, ఎంఈసీలో ఉమామాసా ల్వి 488, మెరుగు జయసింహ 487మార్కులు సాధించినట్లు ఆయన తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో తొగిటి వినూత్న 989, మో హెద్ సోయబ్‌మాలిక్ 988, బైపీసీలో అయేషా తబుస్సుం 981, ఏ సౌజన్య 978, సీఈసీలో చింతకింది మౌనిక 951, పుట్ట వీణశ్రీ 943, ఎంఈసీలో మహమ్మద్ అబ్దుల్ రిజ్వాన్ 982, మహమ్మద్ షకీబుద్దీన్ 973మార్కులు సాధించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను కరస్పాండెంట్ ముసిపట్ల రాజేందర్, డైరెక్టర్ నేరెళ్ల మల్లేశం గౌడ్ అభినందించారు.

కాకతీయ జూనియర్ కళాశాల..
ఇంటర్మీడియెట్ బోర్డు గురువారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని కాకతీయ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్యామల తెలిపారు. ఈ సందర్భంగా ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, కళాశాల ఆచార్య బృందాన్ని అభినందించారు.


99
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles