ఉమ్మడి జిల్లా మోడల్ స్కూళ్లలో గొల్లపల్లి టాప్

Fri,April 19, 2019 02:26 AM

గొల్లపల్లి: గొల్లపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. మోడల్ స్కూళ్ల పరిధిలో రాష్ట్రంలో రెండో స్థానం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఇంటర్ ద్వితీయలో 92.40 శాతం, ప్రథమలో 74.50శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. రెండో సంవత్సరం ఎంపీసీలో గోలి సుజాత-971, గాజంగి మహేశ్వరి-966, బద్దం ప్రవళిక-959, బీపీసీలో సంగెపు విల్సన్-932, పల్లె అపూర్వ-926, అరికెల కృష్ణవేణి-924, సీఈసీలో చెవులమద్ది గర్జన-908, రాచకొండ నవ్వ-904, ఎంఈసీలో సందుపట్ల అనీష్-893, మొదటి సంవత్సరం ఎంపీసీలో మానుక రజిత-432, అడువాల గణేష్-424, బొడ్ల సాయికిరణ్- 410, బీపీసీలో సిరివేణి హర్షిత్-399, మహ్మద్ రహీల-393, సీఈసీలో ముద్దం రేఖ-408, దుంపెటి అనూష-394, ఎంఈసీలో సమ్మెట రక్షిత-392, బ్రహ్మండపల్లి నిఖిత-350 మార్కులతో టాపర్లుగా నిలవగా వారిని ప్రిన్సిపాల్ ఎరవేణి రాజ్ కుమార్ అభినందించారు.

పెగడపల్లి ఆదర్శ పాఠశాలలో 75.40శాతం
పెగడపల్లి: పెగడపల్లి ఆదర్శ పాఠశాలలో 75.40శాతం ఇంటర్ ఫలితాలు వచ్చినట్లు ప్రిన్సిపాల్ సుంకరి రవి తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 94 మందికి 65 (69.14 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. ఎంపీసీలో సింధుశ్రేయ 445/470, బైపీసీలో గండ్ర ఆమని పాఠశాల టాపర్లుగా నిలిచినట్లు చెప్పారు. ద్వితీయలో 61 మందికి 46 (75.40శాతం) శాతం ఫలితాలు సాధించారనీ, ఎంపీసీలో 902 మార్కులతో ఎండీ అజారుద్దీన్, ఎంఈసీలో 898 మార్కులతో పీ లత, బైపీసీలో ఎన్. స్పందన 950, సీఈసీలో ఎం.శ్వేత 908 మార్కులు సాధించి కళాశాల టాపర్లుగా నిలిచినట్లు వివరించారు.

తాటిపల్లి గురుకులంలో 99శాతం
మల్యాల: మండలంలోని తాటిపెల్లి తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో 99శాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ పత్తెం శ్రీనివాస్ తెలిపారు. ఎంపీసీలో 40మందికి గానూ 39మంది, బైపీసీలో 40మందికి గానూ 40మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఎంపీసీలో గట్టు అఖిల 470కి 461, బైపీసీలో బింగి శ్రావ్య 440కి 428 మార్కులు సాధించినట్లు వివరించారు. ఎంపీసీలో 34మంది 400కు పైగా, బైపీసీలో 40మందికి గానూ 18మంది 400కు పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులను అధ్యాపకులు ప్రశాంత్ రావు, మురళీధర్, కాజల్, శ్యాం సుందర్ రెడ్డి, అంజిబాబు అభినందించారు.

ప్రభుత్వ కళాశాలల్లో..
సారంగాపూర్: సారంగాపూర్ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం 85 మందికి 66 (77.64శాతం) మంది, ద్వితీయ సంవత్సరం 72మందికి గానూ 66 (91.66శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. బీర్‌పూర్ జూనియర్ కళాశాలలో ద్వితీయ 133 మందికి గానూ 93 (69.09శాతం)మంది, ప్రథమలో 174మందికి గానూ 98 (56.92శాతం) మంది పాసయ్యారు. సారంగాపూర్ కళాశాలలో ఎంపీసీ ప్రథమ విద్యార్థి సాతాల్ల అనూష 407, బైపీసీ విద్యార్థి ఎం శృజన్య 392, సీఈసీలో యూ రజిత 427 మార్కులు, ద్వితీయ సీఈసీలో బీ జగదీష్ 861, ఎంపీసీలో సీహెచ్ లావణ్య 863, బైపీసీలో ఎం వర్షిని 890 మార్కులు సాధించారు. బీర్‌పూర్‌లో సీఈసీ ప్రథమలో ఏ వందన 435, ఎంపీసీలో ప్రవళిక 407, బైపీసీలో జీ మౌనిక 376, హెచ్‌ఈసీలో శ్వేత 364 మార్కులు పొందారు.

కొడిమ్యాలలో..
కొడిమ్యాల: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సీఈసీలో ఎం మహేశ్వరి 500 మార్కులకు 466, ఎంపీసీలో కే పద్మ 436, ఇంటర్ ద్వితీయ సీఈసీలో కే రేణుక 912, బైపీసీలో పీ సాయిప్రియ 905 మార్కులతో కళాశాల టాపర్లుగా నిలిచినట్లు ప్రిన్సిపాల్ సంజీవయ్య తెలిపారు.

మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ప్రథమ బైపీసీలో టీ కీర్తన 367, రవళి 366, ద్వితీయ బైపీసీలో అంజలి 838, సీఈసీలో చందన 782 మార్కులతో కళాశాల టాపర్‌గా నిలిచారు. ఇంటర్ ప్రథమలో 46మందికి 10మంది, ద్వితీయలో 17మందికి 9మం ది ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ మోహన్ తెలిపారు.

రాయికల్‌లో..
రాయికల్: మండంలంలోని ఆదర్శ పాఠశాలలో గుండోజి భువనశ్రీ బైపీసీలో 914 మార్కులు, రాయికల్ ప్రణుతి జూనియర్ కాళాశాలలో చదివిన శ్రావణి ఎంపీసీలో 966 మార్కులు, రాయికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ గ్రూపులో చదివిన మంక రాధ 907, ప్రభుత్వ కళాశాలలో సీఈసీలో తొపారపు అఖిల 935 మార్కులు సాధించారు. సీఈసీ ప్రథమలో గంగాధర్ 482, ఎంపీసీలో ప్రవళిక 435 మార్కులతో కళాశాల టాపర్లుగా నిలిచారు.

హెచ్‌ఈసీలో రాష్ట్రస్థాయి పదో ర్యాంక్
కథలాపూర్: ఇంటర్ ఫలితాల్లో కథలాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి రాష్ట్రస్థాయి లో సత్తా చాటాడు. సిరికొండకు చెందిన జంగిలి ప్రవీన్, ద్వితీ సంవత్సరం హెచ్‌ఈసీలో 935 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో పదో ర్యాంక్ సాధించాడు. కళాశాలలో హెచ్‌ఈసీలో 18 మం ది విద్యార్థులుండగా 15 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ప్రవీన్ కళాశాల టాపర్, రాష్ట్రస్థాయిలో పదో ర్యాంక్ సాధించాడని ప్రిన్సిపాల్ గౌసుర్ రహమాన్ తెలిపారు.

86
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles