అల్ఫోర్స్‌లో అలరించిన స్టాటిస్టిక్స్ ఫెస్ట్

Thu,April 18, 2019 01:18 AM

కరీంనగర్ రూరల్: నగర శివారు అల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో బుధవారం యంగ్ స్ప్రింగ్స్ పేరిట నిర్వహించిన స్టాటిస్టిక్స్ ఫెస్ట్ అలరించింది. సాంఖ్యాక శాస్త్రం పితామహుడు ప్రొఫెసర్ ప్రశాంతచంద్ర మహాలోనోబిస్ జయంతి సందర్భంగా కళాశాల బీ ఎస్సీ (స్టాటిస్టిక్స్) తృతీయ సంవత్సరం విద్యార్థినులతో స్థానిక శ్రీ బాలా జీ బాంక్వెట్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కళాశాల కరస్పాండెంట్ వీ రవీందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ప్రొఫెసర్ ప్రశాంతచంద్ర మహాలోనోబిస్ చిత్రపటానికి పూల మాల వేసి, కేక్‌కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంఖ్యాక శాస్త్రం ప్రాముఖ్యతను వివరించారు. కృత్రిమ మేధస్సులో, విలువైన సమాచార అన్వేషణలో ఇది అత్యంత కీలక ప్రాతను పోషిస్తుందని తెలిపారు. విద్యార్థులు ఇందులో రాణించి ఉన్నత అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థినులు సాంఖ్యాక శాస్త్ర ఆవిష్కరణలు, తదితరాలపై ప్రదర్శనలు ఇచ్చారు. ఉత్తమ ప్రతిభ చూపిన వారికి కళాశాల కరస్పాండెంట్ చేతుల మీదుగా జ్ఞాపికలు బహూకరించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పీ వెంకటేశ్వర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles