ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

Thu,April 18, 2019 01:18 AM

జగిత్యాల కలెక్టరేట్ : జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శరత్ ఆదేశించారు. జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సంబంధిత ఆర్వోలతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం కలెక్టర్ శరత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 18మండలాలకు సంబంధించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఆర్వోలతో ఎన్నికలపై స మీక్షించారు. ఎలక్ట్రోరోల్ ప్రకారం.. 5,61,963 మంది ఉన్నారనీ, 214 ఎంపీటీసీ, 18 జడ్పీటీసీలకు గానూ 402 పోలింగ్ లొకేషన్స్, 1,116పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామనీ, ఒక్కో జడ్పీటీసీకి ఒక ఆర్వో చొప్పు న 18మందిని నియమించామన్నారు. 214ఎంపీటీసీలకు 3ఎంపీటీసీలకు ఒక ఆర్వోను, ఏఆర్వోను నియమించడం జరిగిందన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఆర్వోలకు సహకరించాలనీ, మండల స్థాయిలో ఎంపీడీవోలు, రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించాలని తెలిపారు. పోలింగ్ స్టేషన్‌లో గతంలో అసెంబ్లీ, గ్రామ పంచాయతీ, లోక్‌సభ ఎన్నికలు నిర్వహించబడ్డాయన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు ఆర్వోలు, ఎంపీడీవోలు తప్పక వెళ్లి సౌకర్యాలు చూడాలని తెలిపారు.

పోలింగ్ స్టేషన్‌కు నంబర్లు వేయాలనీ, క్రిటికల్, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్‌లను గుర్తించాలని తెలిపారు. బ్యాలెట్ బాక్సులను సరి చూసుకోవాలన్నా రు. పోలింగ్ సిబ్బందికి మంచిగా, శిక్షణనివ్వాలనీ, బ్యా లెట్ బాక్సులతో ప్రాక్టికల్‌గా సిబ్బందితో చేయించాలని పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కౌంటింగ్ సెంటర్లను అన్ని వసతులతో కూడినవి చూడాలనీ, బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలనీ, తప్పులు లేకుండా చూడాలని తెలిపారు. పోలింగ్ మెటీరియల్ కూడా అన్ని సరిగా ఉన్నది లేనిది చూడాలన్నారు. దా దాపుగా గత ఎన్నికల్లో విధులు నిర్వహించిన వారు ఎక్కువగా ఉన్నారు కావున అతి జాగ్రత్తగా ఎన్నికల విధులు చేయాలనీ, అలసత్వం వహించకూడదన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ సింధూ శర్మ మాట్లాడుతూ స్ట్రాం గ్ రూం, కౌంటింగ్ సెంటర్ వద్ద, ఎన్నికల పోలింగ్ స్టేషన్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తామనీ, పోలీ స్ శాఖ ద్వారా అన్ని ఏర్పాట్లకు సిద్ధం చేశామని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ బేతి రాజేశం, సబ్ కలెక్టర్ గౌతమ్ పోట్రూ, డీఆర్వో అరుణశ్రీ, ఆర్డీవో నరేందర్, డీపీవో శ్రీలతా రెడ్డి, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles