దళారుల చేతిలో మోసపోకుండా చర్యలు

Thu,April 18, 2019 01:18 AM

కోరుట్ల : దళారుల చేతిలో రైతులు మోసపోకుం డా పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్లు సెర్ప్ సీఈ ఓ పౌసుమి బసు పేర్కొన్నారు. బుధవారం రాత్రి కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామాన్ని ఆమె సందర్శించారు. స్థానికంగా మామిడి కొనుగోలు కు సంబంధించి అవకాశాలను పరిశీలించారు. మామిడి రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశమై మాట్లాడారు. కార్పోరేట్ సంస్థలతో మాట్లాడి రైతుల నుంచి నేరుగా పంట దిగుబడులను గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేసే వి ధానాన్ని త్వరలోనే అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. మామిడి కొనుగోలుకు సంబంధించి రాష్ట్రంలో జగిత్యాల, మంచిర్యాల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలను ఎంపిక చేయడం జరిగిందనీ, అదే విధంగా జగిత్యాల జిల్లాలో గొ ల్లపల్లి, రాయికల్, కోరుట్ల మండలాల్లోని గుర్తించిన గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో మామిడి కొ నుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి నిర్ణీత గిట్టుబాటు ధరతో రైతుల నుంచి నేరుగా మామిడి ది గుబడులను కొనుగోలు చేయనున్నట్లు ఆమె పే ర్కొన్నారు. ఈనెల 23న హైదరాబాద్‌లో కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో ఏర్పాటు చేయనున్న సమావేశంలో మామిడి పంటకు గిట్టుబాటు ధర ను నిర్ణయించాక ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు.

రాబోయే రోజు ల్లో అన్ని రకాల పంటల దిగుబడులను ఐకేపీ ద్వా రా గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేసే విధంగా సెర్ప్ దృష్టి సారించినట్లు చెప్పారు. అంతకు ముం దు మామిడి పంట విస్తీర్ణం, దిగుబడి తీరు, ప్ర స్తుతం మార్కెట్లో పలుకుతున్న ధరలు, క్రయ, విక్రయాలు జరుగుతున్న తీరును మామిడి రైతులు, స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఈఓ వెంట స్థానిక సర్పంచ్ రాధ సందయ్య, సబ్ కలెక్టర్ గౌతమ్, డీఆర్డీఏ పీడీ భిక్షపతి, ఏపీడీ సతీష్, తహసీల్దార్ కోమల్‌రెడ్డి, డీపీఎం మల్లేశ్, ఏపీఎం, సీసీఎస్, వీవోలు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles