అవి డమ్మీ ఈవీఎంలు

Wed,April 17, 2019 12:28 AM

-అవగాహన కల్పించేందుకు ఎం2 నమూనా వినియోగించాం
-వాటిని హైదరాబాద్ తరలించే క్రమంలో కొందరు తప్పుదోవ పట్టించారు
-వీఆర్కే కళాశాల స్ట్రాంగ్ రూంలోఈవీఎంలు భద్రంగా ఉన్నాయి
- విలేకరులతో కలెక్టర్ శరత్
జగిత్యాల అర్బన్ : ఈవీఎంలపై ఎలాంటి ఆందోళన వద్దని, విఆర్‌కె కళాశాలలోని స్ట్రాంగ్ రూములో ఈవీఎంలు భద్రంగా ఉన్నాయని కలెక్టర్ శరత్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అర్ధరాత్రి ఆటో లో తరలుతున్న ఈవీఎంలు అన్న వార్తలో నిజం లేదన్నా రు. కేవలం అవి డమ్మీ ఈవీఎంలు అనీ, వీటిపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా వార్తలు, సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వ్యాపింపజేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటేయడం అ త్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, భారత జాతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటు వేయడంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించామన్నారు. ఇందులో భాగంగా నే పార్లమెంట్ పోలింగ్ ప్రక్రియకు ముందు ప్రతి పౌరుడు విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేసిన విషయం అందరికి తెలిసిందేనన్నారు. ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఈవీఎంల స్టాక్ పాయింట్ నుంచి కొన్ని ఈవీఎంలను మండలాలకు పంపించి నమూనా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. అలాగే వాహనాలపై వీవీ ప్యాట్‌లను, ఈవీఎంలను పంపించి ప్రచారం చేశామన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు జిల్లాల్లో ఉన్న ఈవీఎంలను హైదరాబాద్‌లోని రాష్ట్ర స్ట్రాంగ్ రూమ్‌కు పంపించాలని ఆదేశించారనీ, ఈ నేపథ్యంలో వివిధ మండలాలకు నమూనా కోసం తరలించిన ఈవీఎంలను జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్ రూమ్‌కు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.

జిల్లా అధికారుల ఆదేశాల నేపథ్యంలో మండలాల నుంచి నమూనా ఈవీఎంలు జిల్లా కేంద్రానికి తీసుకురావడం జరిగిందనీ, వాటిని చూసి, కొం దరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేపట్టారన్నారు. పార్లమెం ట్ ఎన్నికల్లో ఎం3 నమూనా ఈవీఎం మిషన్లను వినియోగించిన విషయం అందరికి తెలిసిందేనన్నారు. నమూనా ఈ వీఎం మిషన్లు అన్ని ఎం2 నమూనాకు చెందినవని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా స్ట్రాంగ్ రూమ్ నోడల్ అధికారి జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకే ఎం2 నమూనా మిషన్లు తీసుకురావడం జరిగిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వినియోగించిన ఎం3 నమూనా మిషన్లు విఆర్‌కె కళాశాలలోని స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉన్నాయన్నారు. ఎం2 నమూ నా ఈవీఎంలను చూసి భ్రమపడి, తప్పుడు ప్రచారం చేశారన్నారు. జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో గల గోదాముకు ఈవీఎంలను ఆటోలో తరలిస్తుండగా తప్పు దోవ పట్టించే విధంగా ప్రచారం చేశారన్నారు. తప్పుడు ప్రచారం చేసి, ప్రజల్లో అపోహలు కల్పించిన వారిపైనా, అలాగే సా మాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టినవారిపైన చ ట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ శరత్ వెం ట జాయింట్ కలెక్టర్, జిల్లా స్ట్రాంగ్ రూమ్ నోడల్ అధికారి బేతి రాజేశం, వివిధ పార్టీల నాయకులు ఉన్నారు.

55
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles