అంజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

Wed,April 17, 2019 12:28 AM

మల్యాల : జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవా రం భక్తుల రద్దీ నెలకొంది. ఈ సందర్భంగా ఈ నెల 17నుంచి 20వ తేదీ వరకు హనుమాన్ చిన్న జయం తి ఉత్సవాలు జరగనున్నందున ముందస్తుగానే భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ అధికారులు భక్తుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు క్యూలైన్‌లను క్రమబద్దీకరిస్తూ స్వామి వారి దర్శనానికి అనుమతించారు. ఎండ తాకిడి నుంచి తట్టుకునేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేయడంతో భక్తులు కాసేపు సేద తీరారు. ఆలయ ఆవరణలో రేకు ల షెడ్డు నిర్మించిన హైదరాబాద్‌కు చెందిన బివి చౌదరిని ఆలయ ఈవో అమరేందర్ సత్కరించారు. బేతాళ స్వామి ఆలయం వద్ద శాశ్వతంగా రేకుల షెడ్డును మేడ్చల్‌కు చెందిన కరక మోహన్ రెడ్డి, లావణ్య దంపతులు నిర్మించి ఆలయ అధికారులకు జయంతికి ముందు అ ప్పగించారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో ప్ర ముఖులు సినీ హాస్య నటుడు వేణు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన నాయక్‌లు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్ శర్మ, వైరాగ్యం అంజయ్య పాల్గొన్నారు.

61
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles