సమన్వయంతో పనిచేయండి

Wed,April 17, 2019 12:27 AM

-చిన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి
-భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూడాలి
-తొక్కిసలాట లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి
-అధికారులతో సమన్వయ సమావేశంలో కలెక్టర్ శరత్
మల్యాల : అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి, కొండగట్టు ఆంజనేయస్వామి చిన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ శరత్ అన్నారు. కొండగట్టులో నేటి నుంచి 20వ తేదీ వరకు చిన్న జయంతి ఉత్సవాలు జరుగనుండగా, మంగళవారం కలెక్టర్ స్థానిక ఈఓ కార్యాలయంలో పది శాఖల అధికారులతో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. అంతకు ముందు ఎస్పీ సింధూశర్మతో కలిసి ఆలయ ఆవరణలో జ రుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా కొండగట్టు ఆలయానికి జయంతి ఉత్సవ రోజుల్లో బ్రేక్‌డౌన్ లేకుండా నిరంతరం నీటిని సరఫరా చేయాలని, డీఈఓ స్థా యి అధికారి మూడ్రోజుల పాటు పర్యవేక్షిస్తూ ఆలయ ఆవరణలో నూతన పుష్కరిణిలో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి నింపాలని ఆదేశించారు. పారిశుధ్యం లోపించకుండా ఎప్పటికప్పుడు నీటిని తొలగిస్తూ, నింపాలని సూచించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన షవర్లను, స్నానాల గ దులను సైతం భక్తులు వినియోగించుకునేలా ఏర్పాట్లుండాలన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆలయ ఆవరణ, ఘాట్‌రోడ్డు, బొజ్జ పోతన వరకు చలివేంద్రాలు ఏర్పా టు చేయాలన్నారు.

దీక్షాపరులు కాలినడకన వస్తారనీ, వారికి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తితే చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వై ద్య, ఆరోగ్య అధికారి లావణ్యను ఆదేశించారు. భక్తుల తాకిడి పెరగనున్నందున గుట్టపైనున్న దుకాణాల్లో ధరలను అదుపులో ఉండేలా పర్యవేక్షించాలన్నారు. నీటి ఎద్దడి నివారణకు ట్యాంకర్లతో పాటు జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి మున్సిపాలిటీల పరిధిలోని వాటర్ ట్యాంకర్లను సైతం వినియోగించుకునేలా చూడాలని ఆర్డీవో నరేందర్‌ను ఆదేశించారు. తలనీలాల సమర్పణ, మాల విరమణ సందర్భంలో తొక్కిసలాట జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీస్‌శాఖను ఆదేశించారు. భక్తులు స్వామి వారి ప్రసాదాన్ని కొనుగోలు చేసేందుకు వీలుగా 14 కౌంటర్లు ఏర్పాటు చేశారనీ, వీటికి అదనంగా మరో ఆ రు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఆలయ ఆవరణలో వేసిన చలువ పందిళ్లు తక్కువ ఎత్తులో ఉన్నాయనీ, అలాగే మరికొన్ని చోట్ల పెండ్యాల్ పద్ధతిలో నీడ వసతి కల్పించాలని సూచించారు. జయంతి ఉత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందనీ, భక్తుల సంఖ్యకు అనుగుణం గా బస్సులు నడిపించాలని, ఆర్టీసీ బస్సులను కేటాయించిన పార్కింగ్ స్థలం వరకు మాత్రమే నడిపేలా చర్యలు చేపట్టాలన్నారు.

ప్రయాణికులను మినీ బస్సుల ద్వారా పార్కింగ్ స్థలం నుంచి వై జంక్షన్ వరకు ఉచిత ప్రయాణ వసతి కల్పించనున్నట్లు చెప్పారు. కొండ దిగువన, ఎగువన పారిశుధ్యంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీలతా రెడ్డిని ఆదేశించారు. చలివేంద్రాల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతను రెవెన్యూ సిబ్బందికి సూచించారు. ఎం డల నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా రెండు ఫై రింజన్లు అందుబాటులో ఉంచాలన్నారు. భక్తుల రద్దీ, క్యూ లైన్ల క్రమబద్ధీకరణ, తదితర విషయాల్లో అన్నిశాఖల అధి కారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుం డా పోలీస్‌శాఖకు సహకరించాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా చూడాలనీ, సిబ్బం ది అందుబాటులో ఉండాలన్నారు. అన్ని శాఖ అధికారులు సమన్వయంతో ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయన్నారు. ఈవో అమరేందర్, ఆర్డీవో ఘంటా నరేందర్, జగిత్యాల డీఎస్పీ వెంకట రమణ, జిల్లా పంచాయతీ అధికారి శ్రీలతారెడ్డి, కొడిమ్యాల ఎఫ్‌ఆర్వో అధికారి లత, ట్రాన్స్‌కో ఏడీఈ చంద్రకాంత్, మల్యాల, కొడిమ్యాల ఎంపీడీఓలు సుధాకర్, శ్రీనివాస్, వైద్యాధికారి లావణ్య, మిషన్ భగీరథ ఈఈ శ్రీనివాస్, ఆర్‌డబ్ల్యూఎఎస్ ఏఈ మణిదీప్, పీఆర్ డీఈ భూమయ్య, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీనివాసరావు, మల్యాల తహసీల్దార్ శ్రీనివాస్, మల్యాల సీఐ నాగేందర్ గౌడ్, ఎస్‌ఐ ఉపేంద్రచారి పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles