విధులకు ఆటంకం ఫలితం..తొమ్మిది మందిపై కేసు

Wed,April 17, 2019 12:26 AM

జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని పట్టణ తహసీల్దార్ కార్యాలయంలోకి కొందరు దురుసుగా ప్రవేశించి అధికారుల విధులకు ఆటంకం కలిగించారనీ, వారిపై కేసు నమోదు చేశామని జగిత్యాల పట్టణ సీఐ ఆర్.ప్రకాశ్ తెలిపారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో తహసీల్దార్ కార్యాలయంలోకి దుగ్యాల గోపి కృష్ణారావు, పిట్టల శ్రీధర్, చింత నరేశ్, హరికృష్ణ, రాజరెడ్డి, మహేశ్, వేణుగోపాల్, హైదర్, రవికుమార్ ప్రవేశించి, అనుమతి లేకుండా, బలవంతంగా 3 నమూనా, 2 నమూనా ఈవీఎంలను ఫొటోలు, వీడియోలు తీశారనీ, తప్పుడు పద్ధతిలో తీసిన ఫొటోల ఆధారంగా సోషల్ మీడియాలో వదంతులను, తప్పుడు కథనాలను ప్రచారం చేశారని పేర్కొన్నారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించడమే గాక తప్పుడు వదంతులను వ్యాపింపజేసిన వారిపై జగిత్యాల పట్టణ తహసీల్దార్ సుభాష్‌చందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

45
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles