జై శ్రీరాం

Wed,April 17, 2019 12:26 AM

-కోరుట్లలో హన్మాన్ విజయ యాత్ర
-మార్మోగిన రామనామస్మరణ
-భారీగా పాల్గొన్న దీక్షాపరులు
కోరుట్లటౌన్: కోరుట్ల పట్టణం జై శ్రీరాం నామస్మరణతో మార్మోగింది. దేశం కోసం - ధర్మం కోసం నినాదం పేరిట బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో మంగళవారం వీర హన్మాన్ విజయ యాత్రను నిర్వహించారు. యాత్రను మున్సిపల్ అధ్యక్షుడు గడ్డమీది పవన్ జెండాఊపి, ప్రారంభించగా, హిందూ అభిమానులు, హనుమాన్ దీక్ష స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హిందూ ఐక్యతను చాటి చెప్పాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా విజయయాత్రను నిర్వహిస్తున్నట్లు నాయకులు పేర్కొన్నారు. వీహెచ్‌పీ కార్యకర్తలు గజం రాజు, కొత్త సురేష్, చెట్‌పల్లి శంకర్, మంచాల జగన్, బజరంగ్‌దళ్ కార్యకర్తలు కల్లెడ రోహిత్, గొడికే విజయ్, పల్లికొండ వెంకటేశ్, రాచకొండ చందు, చింత మధుకర్, కొయల్కర్ శివ, సూర్య, విజయ్, వంశీ, కిశోర్, సాయికిరణ్, అరవింద్, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు, హిందూసంఘాల నాయకులు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles