జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు అవగాహన

Tue,April 16, 2019 02:17 AM

మల్యాల : మల్యాల మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా నియామకమైన జూనియర్ పంచాయతీ కార్యదర్శులతో పాటు కార్యదర్శులకు ఈవోపీఆర్డీ జనార్దన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఈవోపీఆర్డీ మాట్లాడుతూ నూతనంగా విధుల్లో చేరిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీలో నిర్వహించే పలు పనులపై అవగాహన కల్పించడంతో పాటు ఏమైనా సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. గ్రామ పంచాయతీలో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఎజెండాను రూపొందించడం, సమావేశాన్ని నిర్వహించినప్పుడు మినిట్స్ ఖచ్చితంగా నమోదు చేయడంలో ప్రత్యేక జాగ్రత్త వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మల్యాల ఈవో రాంరెడ్డి, కార్యదర్శులు రాజు, శేఖర్, అనిత, మేరి శశికిరణ్, స్రవంతి, శ్యామల, నూతనంగా చేరిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులున్నారు.

విధుల్లో చేరిన పంచాయతీ కార్యదర్శులు..
మల్యాల మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల స్థానానికి పది మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను జిల్లా పంచాయతీ అధికారి నియమించారు. తాటిపెల్లి గ్రామానికి ఏ పరమేశ్, బల్వంతాపూర్‌కు ఎం అనిల్ కుమార్, సర్వాపూర్‌కు ప్రవీణ్ కుమార్, మ్యాడంపెల్లికి మహేందర్, ఒబులాపూర్‌కు అజెందర్ రెడ్డి, తక్కళ్లపెల్లికి శేఖర్, గుడిపేటకు తేజస్మిని, మద్దుట్లకు దివ్య, లంబాడిపల్లికి గణేశ్‌ను నియమించగా, వారు సోమవారం విధుల్లో చేరారు. పోతారం గ్రామానికి మాధురిని నియమించగా ఇప్పటి వరకు విధుల్లో చేరలేదు. మల్యాల మండల వ్యాప్తంగా 19గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పటికే ఏడుగురు కార్యదర్శులు అందుబాటులో ఉండగా నూతనంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులతో కార్యదర్శుల సంఖ్య 16కు చేరింది. మండలంలోని గొల్లపల్లె, గొర్రెగుండం గ్రామాలకు ఇప్పటివరకు కార్యదర్శులను నియమించలేదు.

111
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles