నేడే పాలీసెట్..

Tue,April 16, 2019 02:17 AM

జగిత్యాల లీగల్ : తెలంగాణ రాష్ట్రం లో పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశం కో సం నిర్వ హించే పాలిసెట్-2019 ప్రవే శ పరీక్షను ఈనెల 16న మంగళవారం నిర్వహించనున్నట్లు ఎస్‌కేఎన్‌ఆర్ ప్రభు త్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా సమన్వయ కర్త డాక్టర్ ఏ అశోక్ తెలిపారు. జగిత్యాల జిల్లాలో పాలిసెట్ ప్రవేశ పరీక్షకు 1950 మంది విద్యార్థులకు 5పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జగిత్యాల అర్బన్ మండలంలోని ఎస్‌కేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 600మంది, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 200 మంది, శ్రీ చైతన్య హైస్కూల్‌లో 500 మంది, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 400 మంది, గౌతమ్ మోడల్ స్కూల్‌లో 250మంది విద్యార్థులకు ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. ఈ నెల 16న మంగళవారం ఉదయం 10గంటల నుం చి విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతివ్వాలని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థి ఉదయం 9:30గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబడదన్నారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరా లను మొబైల్స్, ట్యాబ్స్, వాచ్‌లు, బ్లూటూత్, కాలిక్యూలేటర్‌ను అనుమతించబడదని పేర్కొన్నారు. వి ద్యార్థులు తమ వెంట పాలిసెట్ హాల్‌టికెట్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను, హెచ్‌బీ లేదా 2బీ పెన్సిల్, ఎరేజర్, షార్ప్‌నర్ విధిగా తీసుకొని రావాలని, పాలిసెట్ కోఆర్డినేటర్ అశోక్, స్పెషల్ అబ్జర్వర్ డాక్టర్ రాజ్‌కుమార్, అబ్జర్వర్ శ్రీహర్ష తెలిపారు.

37
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles