కమనీయం.. రమణీయం రాములోరి కల్యాణం

Mon,April 15, 2019 12:40 AM

-కిటకిటలాడిన ఆలయాలు
-మొక్కులు చెల్లించుకున్న భక్తులు
-పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు
మల్యాల : మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల పరిధిలోని ఆంజనేయ స్వామి ఆలయాలు, సీతారాముల ఆలయాల వద్ద సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మల్యాల మండల కేంద్రంలోని మార్కండేయ దేవాలయం, ముత్యంపేటలోని ఆంజనేయ స్వామి ఆలయం, కొండగట్టు దిగువన గల శ్రీనాథ్ రెసిడెన్షి సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో, రాంపూర్‌లోని ఆంజనేయ స్వామి ఆలయంలో, రాజారాంలోని రామాలయంలో, రామన్నపేటలోని హనుమాన్ ఆలయంలో, బల్వంతాపూర్‌లోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజాది కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి కల్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన కల్యాణోత్సవాల్లో పలువురు దాతలు అన్నివిధాలా సహకరించారు. మల్యాల మండల కేంద్రంలోని మార్కండేయ ఆలయంలో అన్నదానం కోసం రూ.20వేల విరాళాన్ని వడ్డెపెల్లి శశాంత్, పావనీలు, రూ.15వేలు విలువ గల చల్లని తాగునీటిని రాజారాంలో నూకపెల్లికి చెందిన మారంపెల్లి నారాయణ, మజ్జిగ ప్యాకెట్లను రాసమల్ల హరీశ్, కొండగట్టులో భక్తులకు వెయ్యి మజ్జిగ ప్యాకెట్లను రాజస్థాన్ హోటల్ యజమాని సుమేర్ సింగ్ అందజేశారు. ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఆలయ కమిటీ అధ్యక్ష, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సారంగాపూర్ : సారంగాపూర్, బీర్‌పూర్ మండలాల్లోని పలు ఆలయాల్లో ఆదివారం శ్రీరామ నవమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణ వేడుకలను వేద బ్రాహ్మణోత్తముల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం రేచపల్లిలోని శ్రీ జగన్నాథ స్వామి ఆలయం, రంగపేటలోని రామాలయం, సా రంగాపూర్‌లోని సీతారామ చంద్రాలయం, బీర్‌పూర్, తుం గూరు, నర్సింహులపల్లి, రేకులపల్లి, మంగెళ తదితర హనుమాన్ ఆలయాలతో పాటు కొల్వాయి సీతారామచంద్ర స్వా మి ఆలయంలో కల్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు, హనుమాన్ దీక్షాపరులు, అర్చకులు పాల్గొన్నారు.

రాయికల్ : శ్రీరామనవమి వేడులకల్లో భాగంగా రాయికల్ మండలంలోని రామాజీపేట్, అయోధ్యలో రామయ్య, సీత మ్మ కల్యాణోత్సవాన్ని అదివారం అంగరంగ వైభవంగా ని ర్వహించారు. ఆలయాలకు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కొడిమ్యాల : మండల కేంద్రంలోని రామాలయంలో శ్రీరామనవమిని పురష్కరించుకొని సీతారాముల కల్యాణం ఘ నంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఏలెటి మమత-నర్సింహరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో వేదపండితులు సీతారాముల కల్యాణం నిర్వహించారు. కల్యానం అనంతరం స్వామి వారి పట్టు వస్ర్తాలను 16500 రూపాయలకు వేలం పాట నిర్వహించారు ఎంపీటీసీ సభ్యులు ఉప్పు చంద్రశేఖర్, నాంపెల్లి రాజేశం, సురుగు శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీనివాస్, గ్రామ ప్రముఖులు తదితరులున్నారు.

రెండు గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు
మండలంలోని చెప్యాల, పూడూర్ గ్రామాలలో రామాలయంలో సీతారాముల కల్యాణ వేడుకలను ఆదివారం ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల కల్యానాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామ సర్పంచ్‌లు వూట్కూరి రాజశేఖర్‌రెడ్డి, పెద్ది కవిత ఉన్నారు.
జగిత్యాల రూరల్: జగిత్యాల మండలంలోని లక్ష్మీపూర్ ఎక్స్‌రోడ్డులో గల చిన్నగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం శ్రీరామ నవమిని పురస్కరించుకొని సీతారాము ల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దంపతులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నగట్టు ఆలయ కమిటీ చైర్మన్ చిట్ల అంజ న్న, ఉపాధ్యక్షుడు బండారి నరేందర్, చిట్ల రవీందర్, లింగారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు నారాయణ రెడ్డి, చిట్ల శ్రీనివాస్, లింబాద్రి, పిట్ట గంగాధర్ పాల్గొన్నారు.

అర్ఫత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో తాగునీటి సౌకర్యం..
జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో గల శ్రీ కోదండ రా మాలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని ప్రతియేటా అర్ఫత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో సొసైటీ సభ్యులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించి భక్తులకు తాగునీటిని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించడంపై అర్ఫత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులను అభినందించారు.

19వ వార్డు ఆధ్వర్యంలో మజ్జిగ అందజేత..
జిల్లా కేంద్రంలోని 19వ వార్డు ఆధ్వర్యంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఆదివారం జిల్లా కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో జరిగిన ఉత్సవాల్లో భాగంగా భక్తులకు మజ్జిగను అందజేశారు. బ్రహ్మాండబేరి నరేశ్, ప్రశాంత్ రావు, రాంమోహన్ రావు, అజ్జు (రామకృష్ణ), రవీందర్ రావు, వెంకి, రాజేందర్, అనురాధ, పాల్గొన్నారు.

65
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles