విద్యార్థులకు సనాతన ధర్మాన్ని నేర్పించాలి

Mon,April 15, 2019 12:38 AM

-కమలానంద స్వామి
-ఘనంగా సరస్వతి శిశుమందర్ ద్వితీయ వార్షికోత్సవం
కోరుట్లటౌన్: విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచి సనాతన ధర్మాన్ని ఆచరించేలా తర్పీదును ఇవ్వాలని కమలానంద స్వామి అన్నారు. పట్టణంలోని సరస్వతి శిశు మం దిర్‌లో జరిగిన పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహరాలపై విద్యార్థులను ఉద్ధ్దేశించి ప్రవచించారు. యువత పాశ్చత్య జీవనశైలిని విడనాడాలనీ, హైందవ ధర్మాలను పాటించి జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని సూచించారు. శిశుమందిరాల ద్వారా విద్యార్థులకు నేటి సమజానికి అవసరమైన చదువుతో పాటూ సం స్కారం, నైతిక విలువలు నేర్పబడుతాయన్నారు. సదాచారం అనే ప్రత్యేక అంశంతో విద్యార్థుల్లో మంచి అలవాట్లను శిశుమందిరాలు పెంపొందించేందుకు కృషి చేయ డం అభినందనీయమన్నారు. అంతకుముందు విద్యార్థులు భారతీయ సంస్కృతి, సంప్రదాయలను ప్రతిబింబించే, సినీ, జానపద నృత్య రూపకాలతో అహుతులను ఆకట్టుకున్నారు. ఇక్కడ సరస్వతి శిశు మందిరాల పూర్వ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడు శ్రీరెడ్డి, హరిస్మరణ్‌రెడ్డి, ప్రభందాకారిణి అధ్యక్షుడు డాక్టర్ రవికిరణ్, కార్యదర్శి వనపర్తి చంద్రమోహన్, కోశాదికారి నీలి శ్రీనివాస్, సమ కార్యదర్శులు తదితరులున్నారు.

52
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles