ఘనంగా సీతారామ కల్యాణం

Mon,April 15, 2019 12:38 AM

మల్యాల: కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో సీతారాముల కల్యాణాన్ని అర్చకు లు, వేద పండితులు కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయంలో ముత్యాల పందిరి వేసి అర్చకుల ఇంటి నుంచి సీతారాములను ఎదుర్కొని వచ్చారు. అనంతరం ప్రత్యేక వేదికపై ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి వేద మంత్రోచ్ఛరణల నడుమ నూతన వస్ర్తాలంకరణ, బాసింగాల ధా రణ, కన్యాదానం చేసి మాంగళ్యధారణ, తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. లోక కల్యాణార్థం ఆలయ సన్నిధిలో హోమాలు నిర్వహించారు. కల్యాణానికి ఆలయ ఈవో అమరేందర్, శ్రీదేవి దంపతులు పట్టువస్ర్తాలను సమర్పించారు. వేములవాడలో సీతారాముల కల్యాణాన్ని శనివారం నిర్వహించడంతో అక్కడ పాల్గొన్న పలువురు భక్తులు ఆదివారం కొండగట్టుకు తరలివచ్చారు. ఇక్కడ ఏఈవో బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, అంజయ్య, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రాజేశ్వర్ రావు, సంపత్, ప్రధానార్చకులు రామకృష్ణ, మారుతి స్వామి, ఉప ప్రధానార్చకు లు చిరంజీవి, కపిల్, కపిందర్, వేద పండితులు రాజేశ్వర్ శర్మ, పెద్దన్న శర్మ, తదితరులున్నారు.

జిల్లా కేంద్రంలో..
జగిత్యాల టౌన్: శ్రీ రామనవమి సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలో కన్నుల పండువగా రాములోరి కల్యాణం నిర్వహించారు. ధరూర్ క్యాంప్ శ్రీ కోదండ రామాలయం, విద్యానగర్‌లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి, శ్రీ భక్త మార్కండేయంలో వేద మంత్రోచ్చారణల మధ్య కల్యాణం నిర్వహించారు. నిజామాబాద్ ఎంపీ కవిత రాములోరి కల్యాణం, అన్నదానానికి రూ.లక్ష అందజేయగా, మున్సిపల్ ఆధ్వర్యంలో రూ.80 వేలను మున్సిపల్ అధ్యక్షురాలు విజయలక్ష్మి అందజేశారు. కోదండ రామాలయంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దంపతులు, మార్కండేయ ఆలయంలో జాయింట్ కలెక్టర్ బి.రాజేశం దంపతులు పట్టు వస్ర్తాలు, ఓడిబియ్యా న్ని తీసుకొచ్చారు. మార్కండేయ ఆలయంలో కల్యాణానికి ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణం నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు.

శ్రీ సీతారామాంజనేయ స్వామి, శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజలు చేశారు. మున్సిపల్ అధ్యక్షురాలు విజయలక్ష్మి దేవేందర్‌రెడ్డిలు మున్సిపల్ ఆధ్వర్యంలో తలంబ్రాలు అందజేశారు. శ్రీమాన్ నంబివేణు గోపాలచార్య కౌశిక ప్రత్యేక పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ గౌరిశెట్టి హారీష్, ఈఈ రాజేశ్వర్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, ముప్పాల రాం చందర్ రావు, ముదుగంటి రవీందర్‌రెడ్డి, బి భరతేశ్వర్ రావు, కె రాజన్న, హెచ్.సత్యనారాయణ, ప్రభాకర్, కిషన్, సురేశ్ రెడ్డి, బి భారతి, జలంధర్ రావు, ఎన్ సమ్మయ్య, జి రామలింగం, ఆర్ పరమేశ్వర్, కొలుగూరి రాజేశ్వర్ రావు, శ్రీ పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వొల్లాల గంగాధర్, బోగ గంగాధర్, బోగ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు జయశ్రీ, అడువాల లక్ష్మణ్, కోర్టు శ్రీనివాస్, వీరబత్తిని పద్మశ్రీనివాస్, అర్చకులు అరుట్ల పూర్ణచంద్రాచార్యులు, తిగుళ్ల విష్ణుశర్మ, శ్రీనివాస్, గాజుల రాజేందర్, తదితరులున్నారు.

54
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles