వాల్గొండ రామలింగేశ్వరస్వామి ఆలయంలో..

Mon,April 15, 2019 12:37 AM

మల్లాపూర్: గోదావరి నదీ తీరాన, వాల్గొండ గ్రామంలో ఉన్న శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. పురోహితులు బల్యపల్లి కృష్ణప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అం తకు ముందు ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు-సరోజన దంపతులు హా జరై స్వామి వారికి పట్టు వస్ర్తాలు, పుస్తెలు, మట్టెలను సమర్పించడంతో పాటు, మొక్కులను చెల్లించుకున్నారు. అలాగే సిరిపూర్ గ్రామంలోని శ్రీ సీతరామచంద్రస్వామి ఆలయం, మల్లాపూర్ మండల కేంద్రంలో హన్మాన్ ఆలయం, కొత్తదాంరాజ్‌పల్లిలో శ్రీ ఉమా మహేశ్వరాలయాల్లో వేడు కలు నిర్వహించారు. భక్తులకు అ న్నదానం నిర్వహించారు. ఎస్‌ఐ పృథ్వీధర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీఓ కోటేశ్వర్‌రావు, ఆలయ కమి టీ చైర్మన్ సాంబారి శంకర్, సర్పంచులు దండిక గంగు, దర్మసోత్ కళావతి, భూక్య గోవింద్‌నాయక్, బద్దం సరిత, ఎంపీటీసీలు ఇస్లావత్ లక్ష్మీ, పెంటపర్తి లక్ష్మి, దేవాలయ సేవ సమితి అధ్యక్షుడు వెల్పుల రాజగంగారం, మెట్‌పల్లి ము న్సిపల్ అధ్యక్షురాలు మర్రి ఉమారాణి, నాయకులు దేవ మల్ల య్య, ఏనుగు రాంరెడ్డి, తోట శ్రీనివాస్, చి ట్యాల లక్ష్మణ్, కాటిపల్లి ఆదిరెడ్డి, కట్కం నర్సారెడ్డి, క్యాతం నరేశ్‌రెడ్డి, చొప్పరి వెంకటేశ్, మద్దెల నాగేంద్రబాబు, పాట్కూరి సంతోష్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులున్నారు.

40
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles