ఉగాది పురస్కారాలకు 50మంది ఎంపిక

Mon,April 15, 2019 12:37 AM

జగిత్యాల టౌన్: జిల్లా కేంద్రంలోని ఎల్‌ఎల్ గార్డెన్‌లో సోమవారం గానకోకిల కళానిలయం ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 50మంది కళాకారులకు ఉగాది పురస్కారాలు అందిస్తున్నట్లు గానకోకిల కళానిలయం ప్రతినిధి గొల్లపెల్లి శ్రీరాములు గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక అష్టలక్ష్మీ ఆలయంలో ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పౌరాణిక పండితులు నంబి వేణుగోపాలాచార్య కౌశిక చేతుల మీదుగా కరపత్రాలు, గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గానకోకిల కళానిలయం సంస్థను స్థాపించి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల్లో సేవలందించిన వారికి పురస్కారాలు అందిస్తున్నామన్నారు.

హైదరాబాద్‌కు చెందిన సమాజ రత్న అవార్డు గ్రహీత డాక్టర్ కొత్త కృష్ణవేణి, ఆధ్యాత్మిక గాయకురాలు పొద్దుటూరి శాంతి, హుజూరాబాద్‌కు చెందిన రాష్ట్రపతి పురస్కార గ్రహీత వెనిశెట్టి రవికుమార్, ఖమ్మంకు చెందిన సామాజిక రత్న గంజ భాగ్యలక్ష్మి, కరీంనగర్‌కు చెందిన నాట్యరత్న జరుపుల రతన్‌కుమార్, శాస్త్రీయ సంగీత గాయకురాలు బొజ్జ రేవతి, జిల్లా సాంస్కృతిక, సమాఖ్య అధ్యక్షుడు వైఎస్.శర్మ, సహాయ అనాథాశ్రమ నిర్వాహకురాలు గుర్రం పద్మారెడ్డి, హన్మకొండకు చెందిన నాట్యం, నటరత్న కత్తి స్వరూపారాణి, జగిత్యాలకు చెందిన రచయిత, గాయకులు భల్లమూడి రాంప్రసాద్‌శర్మ, టీవీ గాయకులు, తెలంగాణ రత్న పురస్కార గ్రహీత గుండి జగదీశ్వర్‌శర్మ, వేములవాడకు చెందిన ఆధ్యాత్మిక గాయకులు, శివసాయి కృష్ణ భజన మండలి సభ్యులు దివెన్నగారి ప్రమోద, ఆధ్యాత్మిక గాయకులు, శివసాయికృష్ణ భజన మండలి సభ్యులు తీగల పరశురాంగౌడ్, నల్లగొండకు చెందిన ఒగ్గు కథ కళాకారుడు బొల్లి రాజుయాదవ్‌లను ఉగాది పురస్కారాలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకుడు గరిపెల్లి శంకర్, శమంత, రేగొండ నరేశ్, పాంపట్టి రవీందర్, తవుటు రాంచంద్రం, కొత్త మోహన్ తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles