ఘనంగా సీతారాముల కల్యాణం..

Sun,April 14, 2019 01:41 AM

ధర్మపురి,నమస్తేతెలంగాణ: నవనారసింహక్షేత్రాల్లో ఒకటిగా వెలసిన ధర్మపురి క్షేత్రంలోని గో దావరి తీరాన ఉన్న అతి ప్రాచీన రామాలయంలో శనివారం శ్రీరామనవమి వేడుకలను ఆలయ ని ర్వహణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్మార్త సంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి వేడుకలు స్మార్త, వైష్ణవ సంప్రదాయాలను ధర్మపురి క్షేత్రంలో వేర్వేరుగా పాటించడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే శ్రీరామనవమికి తిథి ప్రధానమని తిథితో పాటు పునర్వ సు మధ్యాహ్నం వ్యాపినియైతే మహాపుణ్యప్రదమని, నవమి మధ్యాహ్నం ఉన్ననాడే పండుగ జరపాలని శాస్ర్తాధారాలున్నాయని పండితులు తెలిపారు. అయితే శనివారం అష్టమితో పాటు నవమి కూడి ఉన్నదని, మరునాడు ఆదివారం ఆ తిథి లేదని అందుకే శనివారం నాడు నవమివేడుకలు జరుపుకోవడం శుభప్రదమని కల్యాణోత్సవాన్ని జరిపినట్లు తెలిపారు. శ్రీరామనవమి సందర్భం గా రామాలయంలో ఉదయం వేళలో అభిషేకం, నిత్యపూజలు నిర్వహించారు. మద్యాహ్నం వేళలో కర్కాటక లగ్న సుముహూర్తంలో వేదవిధులైన పండితులచే సీతారాముల కల్యాణాన్ని స్మార్త సం ప్రదాయ రీతిలో ఆలయ వంశపారంపర్య అర్చకులు తాడూరి బాలకిష్టయ్య, తాడూరి బలరామ్‌శర్మ, బాలచంద్రశర్మ, బాలమోహనశర్మ, వామనశర్మ, ప్రభుత్వ దూపదీప నైవేద్య పథక అర్చకులు తాడూరి రఘునాథశర్మ మంత్రోచ్ఛరణల మధ్య కన్నుల వండువగా నిర్వహించారు. భక్తుల కోసం చలువపందిళ్లు, తాగునీటి సౌకర్యం కల్పించారు..

పట్టువస్ర్తాలు సమర్పించిన ధర్మపురి ఆలయ చైర్మన్
గోదావరి తీరాన వెలసిన సీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం నిర్వహించిన సీతారాముల కల్యాణానికి దేవస్థానం పక్షాన చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి నరసింహస్వామివారి ఆల య పక్షాన పట్టువస్ర్తాలు సమర్పించారు. స్వామివారి సన్నిదిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకులకు పట్టువస్ర్తాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తలు మురికి భాగ్యలక్ష్మి, వేదపండితులు బొజ్జ రమేశ్‌శర్మ, సూ పరింటెండెంట్ ద్యావళ్ల కిరణ్, సిబ్బంది, నాయకులు మురికి శ్రీనివాస్ తదితరులున్నారు..

53
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles