హనుమాన్ జయంతి ఏర్పాట్లు బాగుండాలి

Sun,April 14, 2019 01:41 AM

మల్యాల : హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. కొండగట్టు దేవాలయ పరిసరాలను మల్యాల, కొడిమ్యాల మండలాల నాయకులు, అధికారులతో కలిసి శనివారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన మెట్ల దారిని నిర్మించాల్సి ఉన్నప్పటికీ ఇంజినీరింగ్ అధికారులు తొమ్మిది ఫీట్ల వరకు మాత్రమే రోడ్డు వేయాలని డిజైన్ రూపొందించారని తెలిపారు. శాశ్వత ప్రాతిపదికన 50ఏళ్ల వరకూ నిలిచి ఉండేలా 15ఫీట్ల మెట్ల దారి మార్గాన్ని ఏర్పాటు చేయాలన్నారు. విషయం దేవాదాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు. మెట్లదారి గుండా కొండపైకి కాలినడకన వెళ్లిన ఎమ్మెల్యేకు పారిశుధ్య లోపం ఎక్కువగా కనిపించడంతో చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కొండగట్టు గుట్టపై నిత్యం మిషన్ భగీరథ అధికారులు నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా పర్యవేక్షించాలన్నారు. నీటిని గుట్ట కింద గల సంపు వరకు సరఫరా చేయాలన్నారు. పాత కోనేరు, కొత్త కోనేరు, ఇటీవల రూ.6లక్షలతో ఏర్పాటు చేసిన షవర్లను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఆలయ ఈవో అమరేందర్‌తో కలిసి జయంత్యుత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన పలు పనులు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం ఆలయంలో ఆంజనేయస్వామిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఘాట్‌రోడ్డు ద్వారా కొండగట్టు దిగువకు వస్తున్న సమయంలో కొంతమంది ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఘాట్‌రోడ్డును ప్రారంభించకుండానే ఎమ్మెల్యే వెళ్లిపోయారంటూ స్థానిక వ్యాపారులతో కొండగట్టు దిగువన వేచి చూశారు. నేరుగా కొండపై నుంచి కిందకు వచ్చిన ఎమ్మెల్యే రవిశంకర్ వ్యాపారులను కలిశారు. సమస్యను ఫోన్‌లో రోడ్డు సేఫ్టీ డీజీపీ కృష్ణప్రసాద్, కలెక్టర్ డాక్టర్ శరత్, ఎస్పీ సింధూశర్మకు తెలిపారు.

అనంతరం రోడ్డు సేఫ్టీ డీజీపీ కృష్ణప్రసాద్ జయంతి ఉత్సవాల సందర్భంగా కొండగట్టు ఘాట్‌రోడ్డుపై ద్విచక్ర వాహనాలు, లైట్‌మోటార్ వెహికిల్స్‌ను మాత్రమే రాకపోకలకు అనుమతించేలా కలెక్టర్‌కు ఆదేశాలిస్తామనీ, మరో వారం రోజుల్లో క్షేత్రస్తాయి పరిశీలన జరిపి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. కొండ దిగువన గల వ్యాపారులు కాసేపు ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డగించేందుకు యత్నించగా ఎమ్మెల్యే రవిశంకర్, సర్పంచ్ తిరుపతిరెడ్డి వ్యాపారులను శాంతింపజేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఘాట్‌రోడ్డుపై రాకపోకలు కొనసాగించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తైదల శ్రీలత, ముత్యంపేట సర్పంచ్ తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు ఏనుగు రాజిరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు పునుగోటి కృష్ణారావు, మెన్నేని రాజనర్సింగారావు, అయిల్నేని సాగర్‌రావు, కోటేశ్వర్‌రావు, పులి వెంకటేశ్‌గౌడ్, బల్మూరి రాంమోహన్‌రావు, జనగాం శ్రీనివాస్, పంజాల మల్లేశంగౌడ్, కొల్లూరి గంగాధర్, మరాఠి గంగారెడ్డి, తోట అంజయ్య, రాసమల్ల హరీశ్, గాజుల రాములు, అల్లూరి రాజేశ్వర్, పోతురాజు శ్రీనివాస్, నేళ్ల రాజేశ్వర్‌రెడ్డి, పొన్నం మల్లేశం, అయిల్నేని కోటేశ్వర్‌రావు, గుర్రం మల్లేశం, జనగాం శేఖర్, పందిరి శేఖర్, అల్లూరి రాజేశ్వర్‌రెడ్డి, జగదీశ్వర్, అల్లూని అనిల్‌రెడ్డి, అమీర్, గరికంటి మల్లేశం, మోత్కు కొమురయ్య యాదవ్, మరాఠి సత్తన్న, దూస వెంకన్న, అక్తార్ ఖాన్, మిట్టపెల్లి ధశరథం, గడికొప్పుల రమేశ్, జోగినపెల్లి శ్రీనివాస్‌గౌడ్, వొల్లపు గంగాధర్, వివిధ విభాగాల అధికారులు లక్ష్మణ్‌రావు, హరి, మణిదీప్, బోయినపెల్లి మధుసూదన్‌రావు, మనోజ్‌రావు, నషీరొద్దీన్, ఆసం శివకుమార్, శ్రీనివాస్, రజని, తిరుపతి, మల్లారెడ్డి, బుచ్చయ్య, శ్రీనివాస్, లక్ష్మణ్, మల్యాల సీఐ నాగేందర్‌గౌడ్, మల్యాల, పెగడపల్లి ఎస్‌ఐలు ఉపేంద్రచారి, జీవన్ తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles