శ్రీరామ నవమికి ముస్తాబైన ఆలయాలు

Sun,April 14, 2019 01:41 AM

ధర్మపురి,నమస్తేతెలంగాణ: మండలంలోని తిమ్మాపూర్ శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం నిర్వహించనున్న సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే మండలంలోని దొంతాపూర్ సీతారామాలయంలో, ధర్మపురి పట్టణంలోని లక్ష్మీనరసింహస్వామి కాలనీలో గల రామాలయంలో సీతారాముల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలంలోని షాలపల్లిలో గల సీతారామాలయంలో సీతారాముల కల్యాణం నిర్వహించేందుకు ఆలయ పూజారి నందయ్యస్వామి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

పెగడపల్లి: మండలంలోని నంచర్ల, నామాపూర్, ఎల్లాపూర్, ఐతుపల్లి గ్రామాల్లోని శ్రీసీతారామచంద్రస్వామి, పెగడపల్లిలోని శ్రీరాజరాజేశ్వరస్వామి, బతికపల్లి భక్త మార్కండేయస్వామి, మద్దులపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం సీతారాముల కల్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. నంచర్ల రామాలయంలో కల్యాణ వేడుకలు సాయంత్రం చేపట్టనున్నారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం కల్పించారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.
వెల్గటూరు: శ్రీరామ నవమిని పురస్కరించుకుని మండలంలోని అన్ని ఆలయాలను సర్వాంగ సుందరగా ముస్తాబు చేశారు. శ్రీసీతారాముల కల్యాణానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తులు కూర్చోవడానికి టెంటు, చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. వేడుకలకు భక్తులు అధికసంఖ్యలో హాజరు కానున్నారు.

గొల్లపల్లి: మండల కేంద్రంతోపాటు మండలంలోని గొల్లపల్లి, రాపల్లి, రాఘవపట్నం, చిల్వాకోడూర్, లక్ష్మిపూర్ గ్రామాల్లోని పలు ఆలయాలు శ్రీరామనవమి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. ఈ మేరకు ఆలయ కమిటీలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఆదివారం ఆయా ఆలయాల్లో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు కలుగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నారు.

38
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles